సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్య

Submitted on 20 July 2019
Young man commits suicide in janagao

టైటిల్ చూసి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. సెల్ ఫోన్ కొనివ్వలేదనే కారణంతో ఓ యువకుడు ప్రాణాలే తీసుకున్నాడు. తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంత్‌పూర్‌ గ్రామంలో జరిగింది.

పోతానిసత్తయ్య, సులోచనల కుమారుడు ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడు. తనకు సెల్‌ ఫోన్‌ కొనివ్వమని తండ్రిని కోరాడు. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ప్రశాంత్ ని ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్‌ చికిత్స పొందుతూ చనిపోయాడు. చేతికందొచ్చిన కొడుకు చనిపోవడంతో ప్రశాంత్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

young man
commits suicide
janagao

మరిన్ని వార్తలు