అఖిలేష్ కౌంటర్ : సీఎం యోగికి ల్యాప్ టాప్ ఇస్తే.. 2 రోజులు వృథా

Submitted on 24 April 2019
Yogi Adityanath will waste two days if i give him a laptop, Akhilesh Yadav

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సీఎం యోగికి ల్యాప్ టాప్ ఇస్తే.. రెండు రోజులు వృథా చేస్తాడని అఖిలేష్ అన్నారు. యోగికి తనపై ఇలాంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నట్టుయితే.. అప్పుడు ఆయన ఆలోచనలు ఎంతమాత్రం పేదవారితో పోల్చదగినవి కావని ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ ఎదురుదాడికి దిగారు. ఎస్పీ-బీఎస్సీ పార్టీలు కూటమిపై ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో యోగి ఆధిత్యనాథ్ కూడా అఖిలేష్ ను ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
Also Read : రియల్ టైమ్ Pitstop యాప్ : మీ కారులో ట్రబులా? చిటికెలో పరిష్కారం

దేశంలో రాజ్యాంగం అనేది లేకుంటే.. అఖిలేష్.. పశువుల్లా అమ్మేవాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలుగా కౌంటర్ గా అఖిలేష్ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగం లేకుంటే యోగి ఆధిత్యనాథ్ ఏం చేసి ఉండేవాడో చెప్పాలన్నారు. ఏం జరుగుతుందో అందరికి తెలుసునని, తాను చెప్పాల్సిన పనిలేదన్నారు. విభజించు.. పాలించు అనే బ్రిటీష్ విధానాన్ని బీజేపీ ఫాలోవుతున్నట్టు ఉందని అఖిలేష్ ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోడీపై కూడా అఖిలేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో పేదలు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ విఫలమయ్యారని అఖిలేష్ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో రైతులు, పేదలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చాయావాల పేరుతో ఓట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలి.. ప్రచార మంత్రి అక్కర్లేదని అఖిలేశ్ విమర్శించారు. హర్దోయ్ లో ఏప్రిల్ 29న లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. 
Also Read : ఇంట‌ర్ అల‌ర్ట్ : రీ-వాల్యూయేషన్, కౌంటింగ్ కు ఇలా అప్లయ్ చేసుకోండి

Yogi Adityanath
laptop
akhilesh yadav
Narendra Modi
BJP
loksabha elections

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు