కేంద్ర ఎన్నికల సంఘానికి YCP కంప్లయింట్

Submitted on 15 April 2019
ycp leaders met central election commission

APలో ఎన్నికలు ముగిసినా ఇంకా హీట్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘ కార్యలయానికి క్యూ కడుతున్నారు నేతలు. ఒకరిపై ఒకరు కంప్లయింట్స్ చేసుకుంటున్నారు.
EVMలపై అనుమానాలున్నాయని..ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఏప్రిల్ 15 సోమవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు వారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనే దానిపై కంప్లయింట్ చేశారు. 

వైసీపీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, బోత్స సత్యనారాయణతో పాటు ఇటీవలే టీడీపీ నుండి చేరిన నేతలు కూడా సీఈసీని కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వం అప్పులు చేస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని..అధికారులపై వత్తిడి ఎలా తెస్తోంది..తదితర అంశాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ అయిన తరువాత టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. 

YCP
met
Central Election Commission
strong rooms

మరిన్ని వార్తలు