ప్రపంచంలోనే పవర్ ఫుల్ : ఈల్ చేప కుడితే.. 860 వోల్టుల కరెంట్ 

Submitted on 12 September 2019
World's Most Powerful Electric Eel Found In Amazon Rainforest, It Can Deliver Jolt Of 860 Volts

అమెజాన్ రెయిన్ ఫారెస్టులోని జలాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ ఈల్ చేపలను సైంటిస్టులు గుర్తించారు. ఆంగ్విలీఫార్మస్ అనే జాతికి చెందిన పొలుసుగల పాము చేపగా పిలుస్తుంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్టులో ఎలక్ట్రిక్ ఈల్ చేపల జాతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో అత్యంత శక్తివంతమైన విద్యుత్ చేపలకు చెందిన జాతులను సైంటిస్టులు గుర్తించారు. స్మిత్ సోనియన్ ఇన్సిట్యూట్ అండ్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీకి చెందిన సైంటిస్టులు, సాయో పాలో రీసెర్చ్ ఫౌండేషన్ సైంటిస్టుల బృందం కలిసి ఈ రీసెర్చ్ జరిపింది. ఈ ఈల్ విద్యుత్ చేప కుడితే.. 860 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుందని గుర్తించారు. 

మాటల్లో చెప్పలేనంత. ఒక మనిషిని ఈల్ చేప కుడితే తట్టుకోలేనంతగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. షాక్ గురైన వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోవాల్సిందే. ఒక ప్లగ్ షాకెట్ నుంచి డెలివరీ అయ్యే కరెంట్ కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ జలాల్లో ఎక్కువగా ఇలాంటి ఈల్ విద్యుత్ చేపల జాతులు ఉంటాయి. ఈల్ చేపలోని మూడు విద్యుత్ అవయాల నుంచి పవర్ జనరేట్ అవుతుంది. పరిస్థితులను బట్టి ఆయా ఆర్గాన్స్ ఎలక్ట్రిక్ జనరేట్ చేస్తుంటాయి. సైంటిస్టుల రిపోర్టుల ప్రకారం.. 2.5 మీటర్ల పొడవు గల ఈల్ విద్యుత్ చేపను ఎలక్ట్రోపోరస్ వోల్టాయ్ అనే పేరుతో పిలుస్తుంటారు. 

బ్యాటరీని కనిపెట్టిన ఇటాలీయన్ ఫిజిస్ట్ అలెస్సాండ్రో వోల్టా దీనికి ఆ పేరు పెట్టారు. గత 50ఏళ్లుగా అమెజాన్ రెయిన్ ఫారెస్టులో చాలామంది మనుషులు ఈల్ చేప ప్రభావానికి గురవుతూనే ఉన్నారు. ఇలాంటి పెద్ద విద్యుత్ చేపల్లో మరో రెండు కొత్త జాతుల ఎలక్ట్రికల్ ఈల్ చేపలను గుర్తించగలమని రీసెర్చర్ సి. డేవిడ్ డి శాంటా తెలిపారు. విద్యుత్ చేపలు ఏడు నుంచి ఎనిమిది అడుగుల పొడువు వరకు పెరుగుతాయి. 

ఈ రీసెర్చ్ కు సంబంధించి అధ్యయనాన్ని జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురించినట్టు డేవిడ్ తెలిపారు. గ్రేటర్ అమెజాన్ ఫారెస్టులో కొన్ని శతాబ్దాల వరకు ఒకే జాతి ఈల్ చేపలు ఉన్నాయని బ్రెజిల్, సురినేమ్, గయానా ప్రాంతాలవారు నమ్మేవారని శాంటా చెప్పారు. ఈ జాతి ఈల్ చేపలు నీటిలో తమ ఆహారం కోసం వెతికే సమయంలో వేగంగా దూకుతూ ఇలా ఎలక్ట్రిక్ షాక్ ఉత్పత్తి చేస్తుంటాయి. సాధారణంగా వీటి నుంచి వచ్చే విద్యుత్ కారణంగా మనుషుల ప్రాణాలు తీసేంత షాక్ ఉండదని రీసెర్చర్లు తెలిపారు. 

Electric Eel
Amazon Rainforest
Jolt Of 860 Volts
electric shock
Alessandro Volta
electric fish

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు