వరల్డ్ హార్ట్ డే : తిండి కలిగితే..గుండె కలదోయ్

Submitted on 29 September 2019
world heart day Bad And Good Food For Health

గుండెను పది కాలాల పాటు భద్రంగా ఉంచుకోవాలి. తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పీచు పదార్థం, మంచి కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు శ్రీరామరక్ష అంటున్నారు శాస్త్రవేత్తలు. మాంసాహారం తినే వారు వీలైనంత ఎక్కువగా చేపలు తింటే..ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల రూపంలో శరీరానికి మంచి కొవ్వులు అందుతాయంటున్నారు. శాకాహారులైతే అవిశలు, వాల్ నట్స్, బాదం వంటివి తీసుకోవడం బెటర్. చియా సీడ్స్‌లోనైతే ఒమేగా -3 తో పాటు మెగ్నీషియం, కాల్షియం, పీచు పదార్థం కూడా లభిస్తుంది.

ఇంట్లో వాడే నూనెలు కూడా తరచూ మారుతుండడం వల్ల కొవ్వులు శరీరానికి అందుతాయి. పండ్లు, కూయగారాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా వీటిని భర్తీ చేసుకోనే ఛాన్స్ ఉంది. గ్రీన్ టీ కూడా గుండెకు ఎంతో మేలు చేకూరుస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నాశనం చేసి మంచి చేస్తాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి సిరిధాన్యాల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వెల్లుల్లి రక్తంలోని ప్లేట్లెట్లపై ప్రభావం చూపడం ద్వారా రక్త గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందని గుండెకు సంబంధించిన వైద్యులు వెల్లడిస్తున్నారు. 

శరీరంలో నీరు తక్కువైతే..రక్తం సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు కనీసం 35 మిల్లిమీటర్లు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. 60 కిలోల బరువున్న వారు రోజుకు రెండు లీటర్ల కంటె కొంచెం ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. 
Read More : దసరా సెలవులు : అప్పుడే బస్సులు కిటకిట

world heart day
bad
Good Food
Health

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు