అదృష్టం అంటే నీదేనమ్మా : డైమండ్ పార్కుకి వెళితే నిజంగానే డైమండ్ దొరికింది

Submitted on 22 August 2019
WOMEN GETS DIAMOND IN DIAMOND PARK

డైమండ్ పార్కుకు వెళ్తే నిజంగానే డైమండ్ దొరికితే ఎలా ఉంటుందో తెలుసా. వినడానికి బాగున్నా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ సందర్శకురాలికి వజ్రం దొరికింది.

మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలిసి అర్కాన్సస్ లోని డైమండ్స్ స్టేట్ పార్కుకు వెళ్లింది. మిరండా పార్కులో ఈశాన్యంలో ఉన్న కొండప్రాంతంలో కూర్చొని.. వజ్రాలను గుర్తించడమెలా అనే వీడియోను యూట్యూబ్ లో చూస్తూ ముందుకు చూసింది. అక్కడే మెరిసే రత్నం కనిపించింది. ఇంకేముంది..తీరా చూస్తే అది 3.72 క్యారెట్ల డైమండ్. ఏకంగా వజ్రం దొరకడంతో మిరండా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వజ్రాలను కనుగొనడం ఎలా అని యూట్యూబ్ లో చూస్తున్న సమయంలో ఇలా వజ్రం దొరకడంతో నేను భావోద్వేగానికి లోనయ్యానని మిరండా చెప్పింది.  మిరండాకు వజ్రం దొరకడంతో మీది ఎంత అదృష్టమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

diamond
usa
Women
GETS
Park

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు