గుంటూరులో మరో ‘జ్యోతి’ : యువతి గొంతు కోశాడు

Submitted on 21 February 2019
Woman killed by her Boyfriend in Guntur

తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు అధికమౌతున్నాయి. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతిని గొంతుకోశాడో దుర్మార్గుడు. దీనికి కారణం అనుమానం. 

తెనాలి ఇస్లాంపేటకు చెందిన జ్యోతి తండ్రి..సత్యనారాయణ ఫ్రెండ్స్. సత్యనారాయణ కన్ను జ్యోతిపై పడింది. మాయమాటలు చెప్పి యువతిని లొంగదీసుకున్నాడు. ఆమెతో సహజీవనం చేశాడు. ఇదిలా ఉంటే జ్యోతి వేరేవారితో ఫోన్‌లో మాట్లాడుతోందని..ఛాటింగ్ చేస్తోందని సత్యనారాయణ అనుమానించాడు. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం జ్యోతి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సత్యనారాయణ అక్కడకు వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన సత్యనారాయణ వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రగాయం కావడంతో జ్యోతి అక్కడికక్కడనే కుప్పకూలి చనిపోయింది. హత్య చేసిన అనంతరం సత్యనారాయణ నేరుగా పోలీస్ స్టేషన్‌‌కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సత్యనారాయణకు ఇదివరకే వివాహమైనట్లు..ఇద్దరు పిల్లలున్నారని తెలుస్తోంది. 

వేరే ఊరిలో ఉన్న జ్యోతి పేరెంట్స్ తెనాలికి వచ్చారు. తమకు కానిస్టేబుల్ ఫోన్ చేసి దారుణ విషయం తెలిపినట్లు తండ్రి రోదిస్తూ తెలిపాడు. ఎవరు చంపారో తెలియదన్న ఆయన...సత్యనారాయణ అనే వ్యక్తి చంపేశాడని పోలీసులు తెలిపారని పేర్కొన్నారు. పరిచయం పేరిట ఇంత దారుణంగా చేస్తాడని అనుకోలేదని వాపోయాడు. 

Woman
killed
Boyfriend
guntur
Sahajeevanam
Tenali

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు