Woman ‘floats’ mid-air while falling, netizens try to unravel the mystery

వావ్..గాల్లో ఫ్లోట్ అయిన అమ్మాయి! అక్కడ గాల్లో ఏముంది? మిస్టరీ వీడియో..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ అమ్మాయి గాల్లోంచి ఎగిరి కింద ఉన్న కాలువలోకి దూకుదామనుకుంది. అలా ఓ తాడు పట్టుకుని దూకింది..కాలువలోకి దూకుదామనుకుంది. తాడు పట్టుకుని ఊగుతూ తాడుని వదిలేసింది. అలా వదిలేసింది. అనుకున్నట్లుగానే కాలువలోకి పడింది. అదేమీ విశేషం కాదు..అక్కడే జరిగింది ఓ తమాషా..

తాడును వదిలి..కాలువలో పడటానికి మధ్యతో ఓ విచిత్రం జరిగింది. గాల్లోంచి కాలువలోకి పడే సమయంలో ఆమె కాసేపు అలా గాల్లోనే ఫ్లోట్ అయ్యింది. అంతే కొన్ని సెకన్ల సమయం తేలింది. అలా ఆమె గాల్లోంచి నేరుగా నిటారుగా కాలువలో పడకుండా..కాసేపు ఆగి పల్టీ కొట్టి మరీ కాలువలో పడింది. 

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి గాల్లో ఫ్లోట్ అవ్వటం మిస్టరీగా మారింది. ఇదెలా సాధ్యమబ్బా…! అంటూ తెగ ఆలోచించేస్తున్నారు. తలలు గోకేసుకుంటూ తెగ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..

Read:  మాస్క్ ఉంటే రావొద్దు.. భయం వేస్తే ఇంట్లోనే ఉండండి: బార్ ముందు పోస్టర్

Related Posts