బెడ్‌పై విష సర్పాలు : ఫోన్లో మాట్లాడుతూ.. పాములపై కూర్చొంది.. అంతే!

Submitted on 12 September 2019
UP Woman Busy On The Phone Doesn't Realise To Sit On Snakes

మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి. అంతా ఫోన్లలోనే. రోడ్డుపై నడుస్తున్నా.. ఎక్కడ కూర్చొన్నా.. లేదా పడుకున్నా పక్కన ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ స్ర్కీన్ వైపే చూస్తుండి పోవాల్సిందే. పిల్లల నుంచి పెద్దల వరకు గంటల తరబడి ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తుండిపోతున్నారు. కొన్నిసార్లు ఫోన్ వైపు చూస్తూ రోడ్డుపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. యూపీకి చెందిన ఓ మహిళ.. గంటల తరబడి తన ఫోన్ మాట్లాడుతూ.. ప్రాణాలమీదుకు తెచ్చుకుంది. 

తాను ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ కూర్చొంటుందో కూడా గమనించలేకపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఫోన్ ధ్యాసలో పడి.. పాముల మీద కూర్చొన్న సంగతి మరిచింది. విషపూరితమైన పాములు కరవడంతో యూపీ మహిళ అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలు గోరఖ్ పూర్ కు చెందిన గీత అనే మహిళగా పోలీసులు గుర్తించారు. తన భర్త థాయిలాండ్ లో ఉంటున్నాడు. భర్తతో ఫోన్ లో బిజీగా మాట్లాడుతూ పాము కరిచి ప్రాణాలు కోల్పోయింది. 

ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో విషపూరిత పాములు లోపలికి ప్రవేశించాయి. భర్తతో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇంటి గది లోపలికి వెళ్లింది. ఫోన్ మాట్లాడంలో బిజీగా ఉండి.. అక్కడ పాములు ఉన్న విషయం ఆమె గమనించలేదు. ఫ్రింటెడ్ కవర్ వేసిన బెడ్‌పై విష సర్పం ఉంది. అది తెలియని గీత.. అలానే కూర్చొంది. అంతే.. పాము బుసగొడుతూ ఆమెను కాటేసింది. పాము కాటుకు క్షణాల్లో గీత అపస్మారక స్థితిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు, పక్కంటి వారు గదిలోకి వచ్చేసరికి గీత కింద పడి ఉంది.

బెడ్ పై పాములు తిరుగుతున్నాయి. అది చూసిన కుటుంబ సభ్యులు కర్రలతో పాములను చంపేశారు. గీతను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో మరొకటి జరిగింది. తనను పాము కరిచిందనే కోపంతో.. తాగిన మైకంలో ఓ వ్యక్తి పామును పట్టుకుని కొరికి మూడు ముక్కలు చేశాడు. చివరికి అతడు కూడా విష ప్రభావానికి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

Snakes
UP Woman
snake bite
Busy Phone
gita
bed 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు