మీ వాట్సాప్‌లో వైరస్ : App ఓపెన్ చేస్తే.. ఈ Ad వస్తుందా?  

Submitted on 11 July 2019
WhatsApp users take note! Agent Smith malware hides your app

వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్. మీ వాట్సాప్‌లో మాల్‌వేర్ ప్రవేశించింది. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయగానే తరచూ మీకు పాప్ అప్ యాడ్ కనిపిస్తుందా? అలా అయితే మీ వాట్సాప్‌పై వైరస్ ఎటాక్ అయినట్టే. ప్రపంచాన్ని ఈ కొత్త వైరస్ బెంబేలెత్తిస్తోంది. అదే.. ఏజెంట్ స్మిత్ (Agent Smith). ఆండ్రాయిడ్ మాల్‌ వేర్ గా పిలిచే ఈ వైరస్.. ఇప్పటికే 2.5 కోట్లాది మొబైల్ డివైజ్‌‌ల్లో చొరబడినట్టు గుర్తించారు. ఒక్క భారత్ లోని 1.5 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల డివైజ్ ల్లో వైరస్ ఎఫెక్ట్ అయినట్టు ఓ నివేదిక తెలిపింది. అమెరికాలో కనీసం 3 లక్షల డివైజ్ లు ఎఫెక్ట్ అయినట్టు తేలింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై జరిగే వైరస్ ఎటాక్ ల్లో ఇదొకటిగా ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఈ వైరస్ ఎలా చొరబడుతుంటే  : 
ఏజెంట్ స్మిత్ పేరుతో మాల్ వేర్.. ఇది మెల్లగా మీ ఆండ్రాయిడ్ డివైజ్ ల్లోకి చొరబడి కనిపించకుండా తిష్టవేసి ఉంటుంది. మాల్ వేర్ ఎటాక్ అయినట్టు యూజర్ కు ఎంతమాత్రం అనుమానం రాదు. ఇప్పటివరకూ అడ్వర్టైజ్ మెంట్స్ మొబైల్ స్ర్కీన్ పై డిస్ ప్లే కావడం ద్వారా మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఇదొక  యాడ్ మాల్ వేర్ గానే తెలిసినప్పటికీ.. ఎలాంటి డేటాను దొంగలించదు. ఇజ్రాయెల్ సెక్యూరిటీ సంస్థ, చెక్ పాయింట్ అందించిన సమాచారం ప్రకారం.. గూగుల్ సంబంధించి అప్లికేషన్ రూపంలో ఏజెంట్ స్మిత్ మాల్ వేర్ దాడి ఉంటుంది. ఈ వైరస్ కారణంగా ఆండ్రాయిడ్ డివైజ్ లో సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తుతాయి. 

పర్సనల్ డేటా డేంజర్‌లో :
అంతేకాదు.. యూజర్ ప్రమేయం, అనుమతి లేకుండానే ఆటోమాటిక్ గా ఆండ్రాయిడ్ డివైజ్ లో వివిధ మాల్ వేర్ వెర్షన్లతో ఇన్‌స్టాల్డ్ యాప్స్ రీప్లేస్ అవుతుంటాయి. ఆర్థికంగా లబ్ధిపొందడానికి ఈ మాల్ వేర్ మోసపూరితమైన యాడ్స్ డిస్ ప్లే చేస్తుంటుంది. తద్వారా యూజర్ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తస్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఇలాంటి మాల్‌వేర్స్ Gooligan, Hummingbad and CopyCat వంటి వైరస్ లు యూజర్ల డేటాను తస్కరించినట్టు చెక్ పాయింట్ గుర్తు చేస్తోంది. 

సాధారణంగా థర్డ్ పార్టీ యాప్స్ స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుంటేనే మాల్ వేర్ ఎటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. యాప్ ఇన్ స్టాల్ చేయగానే అందులో దాగి ఉన్న మాల్ వేర్ కూడా డివైజ్ లో ఇన్ స్టాల్ అవుతుంది. గూగుల్ అప్ డేటింగ్ టూల్ మాదిరిగా కనిపిస్తూ యూజర్లను మాయ చేస్తుంటుంది. డివైజ్ లో ఎక్కడ కూడా మాల్ వేర్ యాప్ ఇన్ స్టాల్ అయినట్టు ఐకాన్, యాప్ కాని కనిపించదు.

ఈ భాషలు.. మాట్లాడే యూజర్లే టార్గెట్ :
వాట్సాప్ వంటి యాప్స్ లోకి ప్రవేశించి యాడ్స్ రూపంలో కనిపిస్తుంటుంది. హిందీ, అరబిక్, రష్యన్, ఇండోనేషియన్ మాట్లాడే యూజర్లే టార్గెట్ గా ఈ మాల్ వేర్ ను డివైజ్ ల్లోకి జొప్పిస్తుంటాయి. ఇప్పటివరకూ ప్రాథమిక దశలోనే ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశాల యూజర్లపై ప్రభావం పడింది. యుకే, ఆస్ట్రేలియా, యూఎస్ దేశాల్లోని డివైజ్ ల్లో కూడా ఈ మాల్ వేర్ ఎఫెక్ట్ అయినట్టు చెక్ పాయింట్ గుర్తించింది.

WhatsApp
Whatsapp Users
Agent Smith
malware hide
your app
Indian Users


మరిన్ని వార్తలు