వాట్సప్‌లో ఫేక్ న్యూస్ మనమే కనిపెట్టేయొచ్చు

whatsapp-users-can-now-verify-fake-news-web-using-search-message-feature

ఫేస్ బుక్ సొంతం చేసుకున్నప్పటి నుంచి వాట్సప్ సరికొత్త అప్‌డేట్స్‌తో ఆశ్చర్యపరిచే ఫీచర్స్ తో రెడీ అవుతుంది. కొద్ది రోజుల గ్యాప్ లో కొత్త ఫీచర్ రావడం చూసి వినియోగదారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇప్పుడు వాట్సప్ మరో ఫీచర్ తో ముస్తాబవుతోంది. యాండ్రాయిడ్, iOS యూజర్లకు కలిపి ఈ ఫీచర్ అందించనుంది వాట్సప్. వందల కొద్దీ వస్తున్న మెసేజ్ లను మనమూ నమ్మేసి ఫార్వార్డ్ చేసేస్తుంటాం. 

కానీ, ఇది ఒరిజినల్ కంటెంటా అందులో వాస్తవం ఎంతవరకూ ఉందో తెలుసుకోం. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు వాట్సప్ ఓ ఫీచర్ రెడీ చేస్తుంది. దాంతో ఫేక్ న్యూస్ ను ఇట్టే పసిగట్టేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని WAbetainfo తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. 

మెసేజ్ పక్కన సెర్చ్ ఆప్షన్ తో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ఇంకా అధికారికంగా దీనిని విడుదల చేయలేదు. ఒకసారి విడుదల చేశాక ఇదెలా పని చేస్తుందంటే.. యూజర్లు మెసేజ్ పక్కనే ఉన్న సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే దానిని గూగుల్ లో సెర్చ్ చేయాలా అని అడుగుతుంది. యస్ అంటే వెబ్ లో సెర్చ్ అవుతుంది. తద్వారా మెసేజ్ నిజమో.. ఫేకో ఇట్టే తెలుసుకోవచ్చు. 

తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతున్నందున దానిని అడ్డుకోవాలని వాట్సప్ మెసేజింగ్ యాప్ లో ఈ ఫీచర్ తీసుకొచ్చింది. కరోనా వైరస్ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్న నేపథ్యంలో ఏదైనా ఫేక్ న్యూస్ వైరల్ గా మారితే పెను ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

మరిన్ని తాజా వార్తలు