సెర్చ్ ఇమేజ్ ఫీచర్: మీ వాట్సాప్‌లో ఫొటోలు రియలో ఫేకో చెప్పేస్తుంది

Submitted on 14 March 2019
WhatsApp image search feature will help Users to find if their chat image is real or fake

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో రోజుకు మిలియన్ల డేటా షేర్ అవుతోంది. ప్రతిరోజు ఎన్నో మెసేజ్ లు, ఫొటోలు మీ వాట్సాప్, ఫేస్ బుక్ అకౌంట్లలో దర్శనమిస్తుంటాయి. ప్రత్యేకించి వాట్సాప్ లో ఉదయం లేవగానే గ్రీటింగ్ మెసేజ్ ల నుంచి మొదలుకుని న్యూస్, ఫొటోలు, వీడియోలు ఇలా ఎన్నో షేర్ అవుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లతో ఎన్నో అనార్థాలు జరిగిపోయాయి. వాట్సాప్ లో షేర్ అయ్యే డేటా.. ఎంతవరకు వాస్తవం.. ఏది రియల్.. ఏది ఫేక్ న్యూస్ తెలిసే పరిస్థితి లేదు. ఏదైనా ఒక ఫొటోగాని లేదా వీడియో మన వాట్సాప్ కు షేర్ అయితే.. అది ఎంతవరకు వాస్తవం అనేది గుర్తించడం కష్టమే మరి.
Read Also : వన్ టైం ఛార్జింగ్ : కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

అందుకే వాట్సాప్ సంస్థ WABetaInfo ఫేక్ కంటెంట్ స్ర్పెడ్ కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే..  సెర్చ్ ఇమేజ్ ఫీచర్. ఆండ్రాయిడ్ న్యూ బీటా అప్ డేట్ వర్షన్.. ఫొటోల రూపంలో Fake news వాట్సాప్ ప్లాట్ ఫాంపై Spread కాకుండా కంట్రోల్ చేసేందుకు వాట్సాప్ Reverse search image feature ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం సెర్చ్ ఇమేజ్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ సెర్చ్ ఇమేజ్ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. మీ వాట్సాప్ లో షేర్ అయిన ఫొటో.. ఇదివరకే గూగుల్ లో అప్ లోడ్ అయిందో తెలుసుకోవచ్చు. 
Read Also : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు ఇబ్బందులు.. సైబర్ దాడులు జరిగాయా?

అంతేకాదు.. షేర్ అయిన ఇమేజ్ లాంటి ఎన్ని ఇమేజ్ లు వెబ్ లో ఉన్నాయో తెలిసిపోతుందని WABetaInfo తెలిపింది. ఆ ఇమేజ్ ఫేక్.. రియల్ ఇమేజ్ ఇట్టే తెలుసుకోవచ్చు. వాట్సాప్ బీటా కొత్త అప్ డేట్ 2.19.73 వర్షన్ పై కొత్త సెర్చ్ ఇమేజ్ ఫీచర్ రానుంది.

2019 లోక్ సభ ఎన్నికల వేళ..
దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఈజీగా ఫేక్ న్యూస్ వేగంగా spread కావడానికి భారత్ లో వాట్సాప్ మేజర్ ఛానల్ గా మారింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫేస్ బుక్ సంబంధిత సంస్థ వాట్సాప్ సెర్చ్ ఇమేజ్ టూల్ ను తీసుకురానుండటం తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. అభ్యంతరకరమైన కంటెంట్, ఫేక్ న్యూస్ కంట్రోల్ చేయడంపై వాట్సాప్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త సెర్చ్ ఇమేజ్ ఫీచర్ రాకతో ఫేక్ ఫొటోల బెడదకు బ్రేక్ పడనుంది. ఈ ఫీచర్ ద్వారా నేరుగా వాట్సాప్ యూజర్లకు షేర్ అయిన ఫొటో ఎక్కడిదో సెర్చ్ రిజల్ట్స్ లో తెలుసుకోవచ్చు. ఆ ఫొటో నిజమైనదా? ఎవరైనా ఫోటోషాపు వర్క్ చేసిందా? అని తెలుసుకోవచ్చు. 

వాట్సాప్ అందించే ఈ ఫీచర్.. గూగుల్ అధికారిక API సెర్చ్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. వెబ్ లో సెర్చ్ ఇమేజ్ ఆప్షన్ ద్వారా ఏ ఫొటోనైనా వెంటనే గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. గూగుల్ లో అప్ లోడ్ అయిన ప్రతి ఇమేజ్ ను వాట్సాప్ బ్రౌజర్ ద్వారా సెర్చ్ రిజల్ట్స్ లో చూపిస్తుంది. వాట్సాప్ అప్ డేట్ బీటా వర్షన్ డౌన్ లోడ్ చేసుకున్న యూజర్లకు ప్రస్తుతం ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడు రాబోతున్న సెర్చ్ ఇమేజ్ ఫీచర్.. ఇటీవల వాట్సాప్ రిలీజ్ చేసిన అడ్వాన్స్ డ్ సెర్చ్ ఫీచర్ ఒకటి కాదు.. రెండు వేర్వేరు ఫీచర్లు.. అడ్వాన్స్ డ్ సెర్చ్ ఫీచర్ ద్వారా యూజర్లు.. తమ యాప్ లో వెరైటీ మెసేజ్ లను సెర్చ్ చేయవచ్చు. అదే సెర్చ్ ఇమేజ్ ఫీచర్ గూగుల్ ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వర్క్ అవుతుంది.   
Read Also : పేటీఎం యూజర్ల పెద్ద మనస్సు : అమర జవాన్లకు రూ.47కోట్లు విరాళం

WhatsApp
image search feature
Whatsapp Users
Image search
real image
fake image
WABetaInfo  

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు