నో సీక్రెట్ : వాట్సాప్ కాల్స్ హ్యాక్ చేస్తున్నారు.. అప్ డేట్ ఇలా

Submitted on 14 May 2019
WhatsApp fixes vulnerability that allowed attackers to install spyware on smartphones

ప్రముఖ వాట్సాప్ మెసేంజర్ యాప్ యూజర్ల ప్రైవసీని టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ కాల్స్ వింటున్నారు. చాటింగ్, వీడియో కాల్స్ ఎన్ క్రిప్టడ్ చేసినప్పటికీ హ్యాకర్లు ఈజీగా Malicious Code ను.. యూజర్ల ఫోన్లలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. స్పైవేర్ సాఫ్ట్ వేర్ యాప్ ను డెవలప్ చేసి.. యూజర్ల వాట్సాప్ కాల్స్ రహస్యంగా వింటున్నారు.

రిమోట్ సిస్టమ్ తో యూజర్ల అనుమతి లేకుండానే వారి ఫోన్లలో హానికర బగ్ చొప్పించి.. కాల్స్ కూడా వినేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో రహస్యం, సీక్రెట్, వాట్సాప్ కాల్స్ చేస్తే ఎవరికీ దొరకం అనే భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. సీక్రెట్ అంటే మన భ్రమ అనుకోవటం వచ్చేసింది టెక్నాలజీలో. స్పైవేర్ సాఫ్ట్ వేర్ పేరు.. Pegasus. దీన్ని ఎన్ఎస్ఓ గ్రూపు డిజైన్ చేయగా.. ఇజ్రాయిల్ ప్రభుత్వం అనాధికారంగా వాడుతోందని ఆరోపణలు వచ్చాయి. 

వాట్సాప్ కంపెనీ అలర్ట్ : ఇష్యూ ఫిక్స్ :
ఈ స్పైవేర్ ద్వారా యూజర్లు వాట్సాప్ కాల్ కు ఆన్సర్ చేయకపోయినా.. వారి ఫోన్లలో ఇంజెక్ట్ అవుతోంది. తద్వారా యూజర్ల ఆండ్రాయిడ్ లేదా ఐ ఫోన్లలోని కెమెరాలు, మైక్రోఫోన్లు, ఫైల్స్, టెక్స్ట్ మెసేజ్ లు అన్నీ పూర్తిగా హ్యాకర్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. స్పైవేర్ మాల్ వేర్ ఎటాక్ పై స్పందించిన వాట్సాప్ గ్రూపు.. వెంటనే తక్షణ చర్యలు చేపట్టింది. యూజర్ల ప్రైవసీకి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు అప్ డేట్ రిలీజ్ చేసి ఫిక్స్ చేసింది. వాట్సాప్ యూజర్లకు తమ వాట్సాప్ ను వెంటనే అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. 

ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ వరసగా నోటిఫికేషన్లు పంపిస్తోంది. లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ మెసేంజర్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది. మొబైల్ OS కూడా అప్ డేట్ చేసుకోవాల్సిందిగా యూజర్లకు వాట్సాప్ కంపెనీ సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో వాట్సాప్ కు 150 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరోవైపు.. స్పైవేర్ సాఫ్ట్ వేర్ పీగాసెస్ డిజైన్ చేసిన ఎన్ఎస్ఓ స్పందిస్తూ.. వాట్సాప్ కాల్స్ మాల్ వేర్ ఎటాక్ ను ఖండించింది. ఇందులో తమ ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకుంది. 

కొత్త వాట్సాప్ అప్ డేట్ ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలంటే :
మీరు iPhone యూజర్లు అయితే.. 

* యాప్ స్టోర్ లోకి వెళ్లి అప్ డేట్స్ పై క్లిక్ చేయండి.
* వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. అప్ డేట్ బటన్ పై క్లిక్ చేయండి.
* ఐఫోన్ సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ యూజర్లు కోసం :
* ఆండ్రాయిడ్ డివైజ్ లో ప్లే స్టోర్ లోకి వెళ్లి మెనూ బటన్ పై క్లిక్ చేయండి.
* మై యాప్స్ అండ్ గేమ్స్ ట్యాబ్ ఓపెన్ చేయండి.
* వాట్సాప్ యాప్ మెసేంజర్ అప్ డేట్ చేసుకోండి.

WhatsApp
vulnerability
Hackers
spyware
Smartphones
Malware code
Pegasus

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు