భలేగుంది ఈ వీడియో : గుంతల రోడ్డుపై డ్యాన్సులు..సర్కార్ పై సెటైర్లు 

Submitted on 19 September 2019
What a Rosto Song Konkani Goa Potholes 2019 - Cecille Rodrigues

వర్షాకాలం వచ్చిదంటే చాలు రోడ్లపై గుంతలు ప్రజల నడుముల్ని విరగ్గొడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గుంతల్లో పడి జరిగిన ప్రమాదాలకు ప్రాణాలు సైతం పోతున్నాయి. గతుకుల రోడ్లపై ప్రజలు పడే కష్టాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. గుంతల రోడ్లపై ప్రజలు ఎన్నికష్టాలు పడుతున్నారో తెలిపేందుకు ఓ యూట్యూబర్ వినూత్నంగా చూపిస్తూ..సర్కార్ పై సెటర్లు వేశారు. 

గోవాకు చెందిన ఓ యూట్యూబర్.. ఆలోచింపజేసే ఓ వీడియో సాంగ్‌తో ప్రభుత్వానికి చురకలు అంటించాడు. కొంకణీ భాషలో ఉన్న ఈ పాట కేవలం గోవాకే కాదండోయ్..భారత్ లోనే  ఏ రాష్ట్రానికైనా ఇట్టే సెట్ అయిపోతుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది మరి. ఈ పాట చూస్తున్నంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. చివర్లో స్కూటీ నడుపే యువతి కింద పడిపోయినా.. వెనుక కూర్చున్న యువకుడు మొబైల్ చూస్తూ కూర్చోవడం భలే నవ్విస్తోంది.

 ఓ చిన్నారి రోడ్డుపై ఉన్న గుంతలో గాలం వేస్తు చేపల్ని కూడా పట్టేస్తోంది. మరో ఇద్దరు చిన్నారులో వాటర్ లో సర్ఫిక్ చేసేస్తామంటు వచ్చేశారు. ఇద్దరు యువతీ యువకులు రోడ్డుపై కూర్చుని ఏదో చెరువు పక్కనో..వాగు పక్కనో.. బీచ్ లోనో ఎంజాయ్ చేస్తున్నట్లు డ్రింక్ తాగుతున్నట్లుగా కూర్చున్నారు.

Rosto Song
Konkani
Goa
Potholes 2019
Cecille Rodrigues

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు