ఏప్రిల్ 14 తర్వాత అందరి లైఫ్ ఎలా ఉండబోతోంది.. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఎన్ని దశల్లో ఉంటుంది?

what-life-after-apr-14-could-look-kerala-post-lock-down-scenarios-will-work-our-state

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ గడువు ముగిసే తేదీ సమీపిస్తోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు.

ఇప్పుడే లాక్ డౌన్ ఎత్తేస్తే కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే లాక్ డౌన్ ఇప్పట్లో ఎత్తివేయడం సరైనది కాదని తేల్చేశాయి. ఏప్రిల్ 14 తర్వా కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సిందిగా నిర్ణయించాయి. 

లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా బుధవారమే ప్రతిపక్ష నేతలు, ఇతర పార్టీల నేతలతో పార్లమెంటులో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మోడీ ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ సడలింపుతో ఎలాంటి ఆంక్షలను విధిస్తారు అనేది స్పష్టత లేదు. కేరళ తరహాలో పోస్టు లాక్ డౌన్ కార్యచరణను రూపొందించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ రూపొందించిన కొన్ని సిఫార్సుల మేరకు లాక్ డౌన్ ఎలాంటి ఆంక్షలతో కొనసాగనుందో మరో ఆరు రోజుల్లో తేలిపోనుంది.  

మూడు దశల్లో లాక్ డౌన్ ఆంక్షలు :
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేదానిపైనే అందరి దృష్టి పడింది. ఈ లాక్ డౌన్ ఎంతకాలం ఉంటుంది? ఎలాంటి ఆంక్షలు అమలు చేస్తారు? ఎన్ని దశల్లో ఉంటుంది? మరెన్నో అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లాక్ డౌన్ ఆంక్షలపై 17 సభ్యుల గల టాస్క్ ఫోర్స్ మూడు దశలను సిఫార్సు చేసింది. ప్రతి దశలో పరిస్థితుల ఆధారంగా అర్హత పొందిన జిల్లాల్లో ఆంక్షల సడలింపు ఉంటుంది.

అలాంటి జిల్లాలు రివ్యూ తేదీ నుంచి ఒకటో దశకు అర్హత సాధిస్తాయి. ఆయా జిల్లాల్లో వారంలో ఎలాంటి కొత్త కరోనా కేసులు నమోదు కాకపోవడం, హోం నిఘాలో ఉండే వ్యక్తుల్లో 10 శాతం కంటే తక్కువగా ఉండి.. ఆ జిల్లాల్లో హాట్ స్పాట్ ప్రాంతాలు ఉండకూడదు. 

ఇక రెండో దశలో మాత్రం.. ఆ జిల్లాలో రెండు వారాల్లో ఎలాంటి కొత్త కేసులు ఉండకూడదు. హోం నిఘాలో ఉండేవారి సంఖ్య 5 శాతం కంటే ఎక్కువగా ఉండరాదు. హాట్ స్పాట్ లు కూడా లేకుండా ఉండాలి.

అప్పుడే ఆ జిల్లా మూడో దశకు చేరుకుంటుంది. ఈ దశలో రెండు వారాల వ్యవధిలో కొత్త కేసులు నమోదు కాకూడదు. ఎలాంటి కరోనా హాట్ స్పాట్ లు ఉండకూదు. అంతేకాదు. హోం నిఘాలో ఉన్న వ్యక్తుల్లో 5 శాతం కంటే తక్కువగా ఉండాలి. 

దశల వారీగా ఆంక్షల సడలింపు :
ప్రతి దశలోనూ టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. దశలవారీగా ఆంక్షల సడలింపు ప్రాంతాల జాబితాను వేర్వేరు వ్యక్తుల కోసం సిద్ధం చేస్తుంది. ఈ జాబితా ప్రకారం.. ఆయా జిల్లాల్లో తొలి దశలో ఎవరకూ కూడా మాస్క్ లు ధరించకుండా బయటకు రాకూడదు.

ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి మాత్రమే అనుమతి ఉంటుంది. వారికి కూడా మూడు గంటల కంటే ఎక్కువ సమయం అనుమతి ఉండదు. 65ఏళ్లు పైబడినవారు లేదా అనారోగ్యంగా ఉన్నోళ్లు ఇళ్లలోనే ఉండాలి. ప్రైవేటు వాహనాలను సరి-బేసి స్కీమ్ తరహాలో ఆంక్షలు విధిస్తారు. విమాన సర్వీసులు, రైల్వే ట్రాఫిక్ సర్వీసులు మాత్రం రద్దు అవుతాయి. 

ఇక రెండో దశకు అర్హత పొందిన జిల్లాల్లో ఉదయం 7.30 గంటలకు ముందు తమ ఇంటి నుంచి 500 మీటర్ల దూరం వరకు మార్నింగ్ వాక్ చేసేందుకు అనుమతి ఉంటుంది. ఆటోలు, ట్యాక్సీలు నడుస్తాయి. కానీ, గరిష్టంగా ముగ్గురిని మాత్రమే ఉండాలి. స్థానిక బస్సుల్లో ఒక సీటులో ఒక వ్యక్తి మాత్రమే కూర్చోవాలి.  

ప్రయాణికులు ఎవరూ నిలబడరాదు. ఇక మూడో దశలో అంతర జిల్లాల్లో బస్సు రవాణా 2/3 కెపాసిటీతో అనుమతినిస్తారు. దేశీయ విమానాల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సర్వీసులు నడుస్తాయి. రాష్ట్రంలోకి ప్రవేశించే కొత్తవారంతా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని తాజా వార్తలు