ఫేస్ బుక్.. కొత్త కరెన్సీ : లిబ్రా ఏంటి? ఆ పేరు ఎలా పుట్టిందో తెలుసా?

Submitted on 19 June 2019
What is Libra and Facebook's new cryptocurrency

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. లిబ్రా పేరుతో కొత్త డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రపంచంలోని బిలియన్ల మంది యూజర్లు.. ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్స్ చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీ ద్వారా గ్లోబల్ గా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఫేస్ బుక్ అంతా సిద్ధం చేస్తోంది. బిట్ కాయిన్ (క్రిప్టోకరెన్సీ) మాదిరిగా ఉండే లిబ్రా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం రండి. 

1. లిబ్రా అనే పేరు ఇలా వచ్చింది :
* లిబ్రా అనేది.. ఓ గ్లోబల్ కరెన్సీ.. ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్స్ చేసుకోవచ్చు. 
* ఫేస్ బుక్ సొంతగా రూపొందించిన డిజిటల్ సంపద. 
* లిబ్రా.. అనే పేరు.. ప్రాథమిక రోమన్ బరువు కొలత నుంచి వచ్చింది. 
* పౌండ్ కోసం LB సంక్షిప్తంగా లిబ్రా నుంచి తీసుకున్నారు. 
* ఈ రెండెంటి నుంచి లిబ్రా అనే పదం ఉద్భవించింది. 
* ఎన్ క్రిప్టడ్ టెక్నాలజీ.. బ్లాక్ చైన్ మార్కెట్ లో ఇదో కొత్త వెర్షన్.  
* బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలను వాడేందుకు ఎన్ క్రిప్టడ్ టెక్నాలజీ వాడుతారు.

2. ఫేస్ బుక్.. క్రిప్టోకరెన్సీని ఎందుకు తెస్తోంది : లిబ్రాకు ఇంఛార్జ్ ఎవరు?
* ప్రపంచంలోని 1.7 బిలియన్ల మంది ప్రజల కోసం లిబ్రాను లాంచ్ చేస్తోంది.
* బ్యాంకు అకౌంట్ యాక్సస్ చేసుకోలేని వారికోసం ప్రత్యేకించి ఈ కరెన్సీని తీసుకోస్తోంది. 
* లిబ్రా.. ఒక కరెన్సీ.. యాప్.. BYA కంపెనీలన్నీ కలిసి అందించే సర్వీసు..
* ఈ సర్వీసును లిబ్రా అసొషియేషన్ గా పిలుస్తారు.
* లిబ్రా.. ఒక స్థిరమైన కాయిన్.. యూరో లేదా డాలర్ విలువ స్థిరంగా ఉండేలా చేస్తుంది.
* ఇతర క్రిప్టోకరెన్సీల మాదిరిగా కాకుండా తక్కువ అస్థిరత కలిగి ఉండేలా సహకరిస్తుంది. 
* లిబ్రా అసొసియేషన్ ఒక స్వతంత్ర సంస్థ.. స్విట్జర్లాండ్ బేసిడ్ గా రన్ అవుతుంది. 
* లిబ్రా ఇంఛార్జ్... అనుబంధ సంస్థ కాలిబ్రా.. ఇదో డిజిటల్ వ్యాలెట్ 

3. లిబ్రా.. కరెన్సీ ఎలా వాడాలి.. ఏం కొనొచ్చు :
* లిబ్రా యాప్ .. యూజర్లు డిజిటల్ వ్యాలెట్ ‘కాలిబ్రా’ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
* ఈ ఫీచర్.. వాట్సాప్, మెసేంజర్, ఇతర స్వతంత్ర యాప్స్ లో అందుబాటులో ఉంటుంది. 
* లిబ్రా యాప్ ద్వారా ప్రతిరోజు వివిధ విక్రయదారులు లావాదేవీలు జరుపుకోవచ్చు.
* Lyft, Uber.. ఇన్వెస్టర్లు.. లిబ్రా ద్వారా యూజర్లు పొందే సర్వీసులకు చెల్లించవచ్చు. 

4. ఇంతకీ  ఈ కరెన్సీ సేఫేనా? : 
* ఇదో ఫైనాన్షియల్ యాప్.. ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీకి ఫుల్ ప్రైవసీ ఉంటుంది.
* మనీలాండరింగ్, ఆన్ లైన్ ఫ్రాడ్ లను అడ్డుకునే దిశగా కొత్త టెక్నాలజీ తీసుకుస్తోంది.
* ఫ్రాడ్ లో డబ్బులు కోల్పోయిన వారి కోసం లైవ్ సపోర్ట్ యాక్సస్ చేసుకోవచ్చు.

Facebook
Libra
new cryptocurrency
WhatsApp
Messenger
other standalone apps

మరిన్ని వార్తలు