వాటే వండర్ : సముద్రంలో పడిన ఫోన్ తెచ్చి ఇచ్చిన వేల్ 

Submitted on 10 May 2019
whale returns phone to woman after she accidentally dropped it into the sea

రోడ్డు మీద ఫోన్ పడేసుకుంటే మన అదృష్టం బాగుంటే దొరకొచ్చు. అదే సముద్రంలో ప్రయాణించే సమయంలో ఫోన్ అనుకోకుండా పడిపోయిందనుకోండి. దొరుకుతుందా? ఛాన్సే లేదు కదూ. కానీ సముద్రంలో జార విడుచుకున్న ఫోన్ ఓ మహిళకు తిరిగి దొరికింది. అదికూడా ఓ భారీ సముద్ర జీవి తెచ్చి ఇచ్చింది!!. 

ఇటువంటి అద్భుతాలు నమ్మశక్యం కాకున్నా.. ఇలాంటివి నమ్మాల్సిందే. మరి ఆ ఫోన్ కథ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదూ.. ఈ అరుదైన అద్భుతమైన ఘటన నార్వేలోని హమ్మర్ఫెస్ట్‌లో జరిగింది.  సముద్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో మహిళ ఫోన్ జారిపడింది. ఫొన్‌ పోయిందని చాలా బాధపడింది. 

సముద్రంలో తిరిగే వేల్ చేప ఆ ఫోన్‌ను నోటితో పట్టుకుని తిరిగి ఆమెకు అప్పగించడంతో సంతోషం వ్యక్తం చేసింది. మన్సికా అనే మహిళ తన ఫ్రెండ్స్ తో కలిసి హహ్మర్ఫెస్ట్‌లో సముద్రంలో అరుదైన సముద్ర జీవులను చూసేందుకు బోటుపై  షికారుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె  వేసుకున్న జర్కిన్ పాకెట్ లో ఉన్న ఫోన్ సముద్రంలో పడిపోయింది. ఇక ఫోన్ దొరకటం అసాధ్యమని ఆశలు వదిలేసుకుంది.

ఫోన్ పడిపోయిన కొద్ది సేపటికి.. ఓ వేల్ (సముద్రాలలో ఉండే అతి పెద్ద చేప) ఆ  ఫోన్‌ను నోటితో పట్టుకుని పైకి తీసుకురావడం చూసి మన్సికాతో పాటు ఆమె స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన ఘటనను ఆమె స్నేహితురాలు ఇసా ఓప్దాల్ లర్సాన్ వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకు  1,60,000 వ్యూస్ వచ్చాయి.

whale
phone
accidentally dropped
Sea
Mansika

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు