పశ్చిమ టీడీపీలో సీట్ల పంచాయితీ.. రాజీనామాలు.. ఖరారైన 11సీట్లు

Submitted on 15 March 2019
West Godavari Candidates First List

తెలుగుదేశం అభ్యర్ధులను ఖరారు చేసే విషయమై సర్వేలు సమీక్షలు చేసిన అనంతరం.. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను మార్చి అభ్యర్ధులను ఖరారు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలుండగా.. కొవ్వూరు, ఆచంట, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, చింతలపూడి స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను చంద్రబాబు ఖరారు చేశారు. 11స్థానాలను ఖారారు చేసి ప్రకటించారు. 4స్థానాలకు మాత్రం సీట్లను ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జిల్లా మంత్రి జవహర్‌కు టిక్కెట్ దక్కలేదు. ఈ నియోజకవర్గం నుండి వంగలపూడి అనితకు టిక్కెట్ దక్కింది. జవహార్‌ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారు. 
Read Also: ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!

ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి జవహర్‌కు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో తెలుగు తమ్ముళ్లు పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. కొవ్వూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వారివారి పదవులుకు రాజీనామాలు చేశారు. కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల టీడీపీ అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి జవహర్‌కే మళ్లీ కొవ్వూరు సీటు ఇవ్వాలంటూ స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక జిల్లాలో పోలవరం, నిడదవోలు, ఉంగుటూరు, నరసాపురం టిక్కెట్ల విషయంలో నేతలకు టీడీపీ క్లారిటీ ఇవ్వలేదు. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
ఓసీలు- 07
బీసీలు-01
ఎస్సీలు-03

పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:
కొవ్వూరు - వంగలపూడి అనిత 
ఆచంట - పితాని సత్య నారాయణ 
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు 
భీమవరం - పులపర్తి రామాంజనేయులు 
ఉండి - వేటుకూరి వెంకట శివ రామరాజు 
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ 
తాడేపల్లి గూడెం - ఈలి నాని 
దెందలూరు - చింతమనేని ప్రభాకర్ 
ఏలూరు - బడేటి కోట రామారావు 
గోపాలపురం - ముప్పిడి వెంకటేశ్వర రావు 
చింతలపూడి - కర్రా రాజారావు 

ఖరారు కాని స్థానాలు:
పోలవరం.   
నిడదవోలు
ఉంగుటూరు
నరసాపురం 

West Godavari
TDP
seats
Chandrababu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు