వెదర్ అప్‌డేట్ : పొగమంచుతో జాగ్రత్త

Submitted on 23 January 2019
Weather Update, Fog Alert

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవైపు చలి మరోవైపు పొగమంచు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంటే, పొగమంచు ముంచెత్తుతోంది. హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం, రాత్రి సమయాల్లో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

 

పొగమంచు కారణంగా విజిబులిటి బాగా పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ కూడా లైట్లు వేసుకుని డ్రైవ్ చేస్తున్నారు. పొగమంచు కారనంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్ర పెరుగుతోంది.

 

దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. రైళ్ల రాకపోకలపై పొగమంచు ప్రభావం పడింది. పొగమంచు కారణంగా 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

weather update
fog alert
Telangana
Hyderabad
Cold waves
cold winds

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు