రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు

Submitted on 19 June 2019
weather report

హైదరాబాద్: అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నైరుతీ రుతుపవనాల్లో కదలిక వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్  శాస్త్రవేత్త నాగరత్నం చెప్పారు. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. జూన్ నెల మొదటి వారంలో కేరళను తాకిన రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు తుఫాను కారణంగా బలహీన పడ్డాయని వివరించారు. 

పశ్చమ మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రుతుపవనాలు బలపడుతున్నాయని ఆమె వివరించారు. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం పెరిగిందని, దీని ప్రభావం వల్ల రానున్న2,3 రోజుల్లో ఏపీ, రాయలసీమ తెలగాణాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో పశ్చిమ  దిశగా  ప్రవేశిస్తాయని ఆమె వివరించారు. జులై నెలలో అల్పపీడనాలు ఏర్పడితే రుతుపవనాలు  మరింత బలపడి  విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆమె చెప్పారు. 

Andhra Pradesh
Telangana
Weather
Bay of Bengal
Mansoons
Rains

మరిన్ని వార్తలు