మేం ట్రోఫీని మార్చుకున్నాం: ఎంఎస్ ధోనీ

Submitted on 13 May 2019
We were passing the trophy to each other

ఐపీఎల్ చరిత్రలో నాల్గోసారి టైటిల్ గెలుచుకుని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరతమైన పోరులో చివరి బంతి వరకూ ఉత్కంఠత లేపి ఒక్క పరుగు తేడతో విజయం సాధించింది. ఆఖరి 2ఓవర్లలో 17పరుగులు రావాల్సి ఉండగా షేన్ వాట్సన్ అవుట్ అవడంతో చెన్నై మ్యాచ్ చేజారిపోయింది. 

బుమ్రా బౌలింగ్‌లో చెన్నై కీలక వికెట్ చేజార్చుకుంది. ముంబై విజయానంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ.. ఇది చాలా ఫన్నీ గేమ్. మేం ట్రోఫీని చేతులు మార్చుకున్నాం. ఇరు జట్లు తప్పులు చేశాయి. కానీ, చెన్నై ఎక్కువ తప్పులు చేసింది. మా బౌలర్లు బాగా రాణించారు. అవసరమైన ప్రతి చోటా వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో ఇంకొంచెం రాణించి ఉంటే బాగుండేది' అని తెలిపాడు. 

2017 ఐపీఎల్ టైటిల్ విజేత అయిన ముంబై ఇండియన్స్ .. 2018సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రోఫీని అందజేసింది. 2019లో టైటిల్ గెలుచుకుని చెన్నై నుంచి తిరిగి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ (80; 59 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులు)తో మెరుపులు కురిపించగా, ముంబై బౌలర్ బుమ్రా 4ఓవర్లు వేసి 2/14తో మెప్పించారు. 

MS Dhoni
CSK
chennai super kings
IPL 2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు