మేం ఎన్డీఏలో భాగం కాదు : సీఎం కేసీఆర్

Submitted on 18 June 2019
We are not part of the NDA : CM KCR

ఎన్డీఏలో తాము భాగం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంతో రాజ్యాంగబద్ధమైన సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్రం నుంచి అదనంగా రూపాయి కూడా రాలేదన్నారు. మిషన్ భగీరథ, కాకతీయకు 24 వేల కోట్లు ఇమ్మని నీతి ఆయోగ్ చెబితే.. రూ.24 కూడా ఇవ్వలేదని చెప్పారు.

రాష్ట్రం డబ్బులు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. విపక్షాలపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య గతంలో చాలా వివాదాలు ఉండేవని, బస్తీమే సవాల్ అన్నట్లుగా వాతావరణం ఉండేదన్నారు. ఏపీలో ప్రభుత్వం మారాక, వైఎస్ జగన్ సీఎం అయ్యాక పరిస్థితి మారిందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడిందని, సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కేసీఆర్ చెప్పారు. ఇది చాలా మంచి పరిణామం అని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగింత పూర్తయిందన్నారు. 
 

CM KCR
Cabinet
teklanagana
Hyderabad
NDA

మరిన్ని వార్తలు