రూ. 300 కోట్ల క్లబ్‌లో ‘వార్’

Submitted on 21 October 2019
War Box - Hrithik Roshan, Tiger Shroff Join Rs 300 Crore Club

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ‘వార్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదలైంది. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రీసెంట్‌గా రూ. 300 కోట్ల క్లబ్‌లో ఎంటరైంది.

రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ‘వార్’ రూ. 100 కోట్లు వసూలు చేసింది. హృతిక్, టైగర్‌ల పర్ఫార్మెన్స్, వాణీ కపూర్ గ్లామర్, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా ‘వార్’ రూ. 300 కోట్ల  క్లబ్‌లో ఎంటరైంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ధూమ్ 3’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాల తర్వాత రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది ‘వార్’..


Read Also : పూరిలో ‘ఉప్పెన’ షెడ్యూల్

‘బాహుబలి : ది బిగినింగ్’, ‘దంగల్’, ‘సంజూ’, ‘పీకే’, ‘టైగర్ జిందా హై’, ‘బజరంగీ భాయ్‌జాన్’, ‘పద్మావత్’, ‘సుల్తాన్’ సినిమాల తర్వాత బాలీవుడ్‌లో రూ. 300 కోట్లు వసులు చేసిన సినిమాగా ‘వార్’ రికార్డ్ క్రియేట్ చేసింది. హీరోలిద్దరితో పాటు దర్శకుడికీ కెరీర్‌లో ఫస్ట్ హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది ‘వార్’..


 

Hrithik Roshan
Tiger Shroff
Vaani Kapoor
Yash Raj Films
Siddharth Anand

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు