రైతులకు సాయం - 'విశాల' హృదయం

Submitted on 15 May 2019
Vishal  to Donate ₹1 from Every Ticket Sold for Ayogya to Farmers Welfare in Tamilnadu

తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. విశాల్ నటించిన అయెగ్య (తెలుగు టెంపర్ రీమేక్) ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోగా, నిర్మాతగా, నడిఘర్ సంఘం జనరల్ సెక్రటరీగా బిజీగా ఉండే విశాల్, ఆపన్నులను ఆదుకోడానికెప్పుడూ ముందుంటాడు. గతంలో తమిళనాడులో వరదలు సంభవించినప్పుడు అతను చేపట్టిన సేవా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు తమిళనాడులోని అన్నదాతలను ఆదుకోవడానికి తనవంతుగా ముందుకొచ్చాడు విశాల్. తను నటించిన అయోగ్య సినిమాకి సంబంధించి ఒక్కో టిక్కెట్టుపై ఒక్కో రూపాయి రైతులకు విరాళంగా ఇవ్వబోతున్నాడు. ప్రతీ టికెట్‌పై ఒక రూపాయిని తమిళనాడు ఫార్మర్స్ వెల్ఫేర్‌కి ఇవ్వనున్నాడు. గతంలోనూ ఇదే విధంగా రైతులను ఆదుకున్నాడు విశాల్.. అతను తీసుకున్న నిర్ణయం గొప్పదని విశాల్‌ని పలువురు ప్రశంసిస్తున్నారు.

వాచ్ అయోగ్య ట్రైలర్..

Vishal
Ayogya
Vishal to Donate ₹1 from Every Ticket Sold for Ayogya to Farmers Welfare

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు