కరోనా ఎంతపని చేసింది.. సింగపూర్ లో భర్త అంత్యక్రియలు, భార్య వాట్సాప్ కు ఫొటోలు

Submitted on 9 April 2020
visakhapatnam native suspicious death in singapore

కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. విశాఖపట్నం జిల్లాలో అలాంటి విషాదం ఒకటి చోటు చేసుకుంది. దేశం కాని దేశంలో కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే ఆ వ్యక్తి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల ఫొటోలు, వీడియోని మృతుడి భార్యకు వాట్సాప్ లో పంపారు.

విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్యారావు (35) పొట్టకూటి కోసం సింగపూర్‌ కి వెళ్లాడు. ఓ కంపెనీలో వెల్డర్ గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విమానాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో కడచూపు చూసుకునేందుకు కూడా సూర్యారావు కుటుంబసభ్యులకు అవకాశం లేకపోయింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.

వమ్మవరం గ్రామానికి చెందిన సూర్యారావు నాలుగు నెలల కిందట సింగపూర్‌ వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం పనిచేస్తుండగా సూర్యారావు మృతి చెందినట్టు సంబంధిత కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్‌లో తమకు సమాచారమిచ్చినట్టు అతడి భార్య శ్రావణి చెప్పారు.

తన భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియలేదన్నారు. ప్రమాదమా?, మరేమైనా కారణమా? అనేది చెప్పలేదని వాపోయారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చే దారి లేక అక్కడ ఉన్న సూర్యారావు స్నేహితులు, సిబ్బంది, తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వీడియో, ఫొటోలు తమకు పంపారని శ్రావణి చెప్పారు. సూర్యారావు, శ్రావణి దంపతులకు ఒక బాబు(4), పాప(3) ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సింగపూర్‌ వెళ్లిన తన భర్త మరణించడంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని శ్రావణి కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం భర్త కడసారి చూపు కూడా దక్కలేదని గుండెలు పగిలేలా రోదించారు.(సహజీవనం చేసిన యువతి వదిలి వెళ్లిపోవడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య)

Visakhapatnam
dies
Singapore
suspicious
funeral
wife
WhatsApp
Video
coronavirus
dead body

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు