జట్టులో ఆ ఒక్క స్థానాన్ని మారిస్తే చాలు: కోహ్లీ

Submitted on 14 March 2019
VIRAT KOHLI SAYS ONLY ONE POSITION IS PENDING

ఐసీసీ వరల్డ్ కప్ 2019కు ముందు టీమిండియా ప్రయోగాలకు దిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో తమ జట్టు బలబలాలను పరీక్షించుకోవడానికి ఫలితాలను పట్టించుకోకుండా ఆడింది. మొత్తంగా 2-3తేడాతో సిరీస్ చేజార్చుకున్నప్పటికీ వరల్డ్ కప్‌కు టీమిండియా సెట్ అయిపోయింది. కాకపోతే ఇంకా జట్టులో ఒకే ఒక్క స్థానం గురించి చర్చించాల్సి ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 
Read Also : పరాజయాల జట్టుతో ప్రపంచ కప్‌కు టీమిండియా

'ప్లేయర్లంతా పట్టుదలతో కనిపిస్తున్నారు. సిరీస్‌లో ప్రతిభతో రాణించారు. కొద్ది నెలలుగా మా వాళ్ల చేసిన ప్రదర్శన మాకు గర్వంగా అనిపించింది. ఇరు జట్లు ఒకే తీవ్రతతో కనిపించాయి. మేమంతా ప్రపంచ కప్ టోర్నీకి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, ఆ ఒక్క స్థానంలో మాత్రం ఎవరిని ఉంచాలా అని చర్చిస్తున్నాం. చివరి 3 వన్డేల్లో చక్కటి అవకాశాలొచ్చినా మేం వినియోగించుకోలేకపోయాం' అని కోహ్లీ తెలిపాడు. 

టీమిండియాలో ఎప్పటినుంచో నలుగుతోన్న ప్రశ్న.. నాల్గో స్థానం గురించి చేసిన ప్రయోగాలన్నింటిలోనూ ఏ క్రికెటర్ సరిపోవడం లేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌లో సత్తా చాటిన అంబటి రాయుడుని కొన్ని నెలలుగా నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దించి ప్రయోగాలకు తావిచ్చింది టీమిండియా. రాయుడు ప్రదర్శన సంతృప్తికరంగా లేదని విమర్శలు వస్తున్న తరుణంలో మరో సారి 4వ స్థానం కోసం టీమిండియా సెలక్షన్ కమిటీ వెతుకుతున్నట్లుగా అనిపిస్తోంది. 

'ఈ సిరీస్‌లో ఓటమి వరల్డ్ కప్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదు. జట్టులోని అన్ని విభాగాల నుంచి టోర్నీకి సిద్ధమైయ్యాం. ప్రపంచ కప్‌లో సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాం' అని కెప్టెన్ ముగించాడు. 
Read Also : రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్

Team India
2019 icc world cup
cricket

మరిన్ని వార్తలు