మీరే తేల్చుకోండి: వరల్డ్ కప్ గురించి స్మార్ట్‌గా ఆలోచించమంటోన్న కోహ్లీ

Submitted on 14 March 2019
VIRAT KOHLI SAYS, BE SMART FOR IPL AND WORLD CUP

మరి కొద్ది రోజుల్లో దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ మార్చి 23న ఆరంభం కానుంది. టీమిండియా క్రికెటర్లు మార్చి 13న ముగిసిన ఐదో వన్డేతో ప్రపంచ కప్ వరకూ మధ్యలో ఉన్న సమయంలో ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ.. జట్టును ఉద్దేశించి ఇలా మాట్లాడాడు. 'ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) సంవత్సరానికి ఒకసారి వచ్చేది.. కానీ, వరల్డ్ కప్ నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. కాస్త స్మార్ట్ గా ఆలోచించండి. పని భారాన్ని ఎలా సమన్వయపరుచుకోవాలో నిర్ణయించుకోండి' అంటూ క్రికెటర్లకు సందేశమిచ్చాడు. 
Read Also : రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్

'ఐపీఎల్‌లో ఆడొద్దని చెప్పడం లేదు. కానీ, కొంచెం స్మార్ట్ గా వ్యవహరించండి. తెలివైన నిర్ణయాలు తీసుకుని పని ఒత్తిడి తగ్గించుకునేలా ఆడండి. ఎవ్వరూ ఇది చేయాల్సిందేనని బలవంతపెట్టరు. దీంతో పాటు వరల్డ్ కప్‌కు అవకాశమొచ్చిన ఏ క్రికెటర్ వదులుకోవాలని అనుకోడు' అని జట్టు సహచరులను ఉద్దేశించి మాట్లాడాడు. మూడు వన్డేల ఓటమి తర్వాత వరల్డ్ కప్‌కు వెళ్లేముందు కూడా కోహ్లీ జట్టుకు ఏ ఇబ్బంది లేదని టీమ్ మేనేజ్మెంట్ పైనే అంతా ఆధారపడి ఉందని తెలిపాడు. ఈ సీజన్ అంతా తమ ప్లేయర్లు బాగా ఆడారని ప్రోత్సహించేలా మాట్లాడాడు. టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్‌ను ఎంజాయ్ చేసి తిరిగి వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
Read Also : పరాజయాల జట్టుతో ప్రపంచ కప్‌కు టీమిండియా

Virat Kohli
Team India
IPL 2019
cricket
2019 icc world cup

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు