అందుకే సెలక్ట్ చేశాం : దినేశ్ కార్తీక్ ఎంపికపై కోహ్లీ చెప్పిన కారణం ఇదే

Submitted on 15 May 2019
Virat Kohli reveals why Dinesh Karthik was picked ahead of Rishabh Pant

భారత ప్రపంచ కప్ జట్టుకు దినేశ్ కార్తీక్ నే ఎందుకు సెలక్టర్లు ఎంపిక చేశారో కెప్టెన్ విరాట్ కోహ్లీ రివీల్ చేశాడు. దినేశ్ కార్తీక్ అనుభవం, ఒత్తిడి పరిస్థితుల్లో నేర్పుతో ఆడగల సత్తా ఉండటమే అతడికి జట్టులో చోటు దక్కేలా చేసిందన్నాడు. లేదంటే.. యంగ్ సెన్సెషన్ రిషబ్ పంత్ రెండో వికెట్ కీపర్ గా జట్టులో చోటు దక్కేదని కోహ్లీ తెలిపాడు. ‘ఒత్తిడి పరిస్థితుల్లోనూ కార్తీక్ నేర్పు ప్రదర్శించగలడు. దినేశ్ విషయంలో ప్రతిఒక్కరూ నమ్మడానికి ఇదే అసలైన కారణం. ఎంతో అనుభవం ఉంది కూడా.
Also Read : డ్యూటీతో గేమ్స్ వద్దు : CRPF జవాన్ల ఫోన్లలో PUBG బ్యాన్

ధోనీకి గాయమైతే.. కార్తీకే వికెట్ కీపర్ :
ఒకవేళ ధోనీ గాయపడితే అతని స్థానంలో కార్తీక్ వికెట్ కీపర్ గా అవకాశం వస్తుంది. మంచి ఫినిషర్ గా రాణించగలడు కూడా. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకునే దినేశ్ కు తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది’ అని కోహ్లీ చెప్పాడు. 2004లో అంతర్జాతీయ వన్డేలో ఆరంగేట్రం చేసిన దినేశ్ ఇండియా తరపున 91 మ్యాచ్ లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ ఆర్డర్ లో రాణించగల సత్తా అతడి సొంతం. ఇండియా తరపున 26 టెస్టుల్లో దినేశ్ ఆడాడు. 

మరోవైపు.. 2019 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు టీమిండియా సిద్ధమవుతోంది. ఏప్రిల్ లోనే భారత ప్రపంచ కప్ జట్టుగా 15మంది సభ్యుల టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. అప్పటినుంచి భారత జట్టులో సభ్యుల ఎంపికపై కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ కప్ జట్లు.. మే 23 వరకు తమ జట్టులో మార్పులు చేసుకునేందుకు వీలుంది. మే 30 నుంచి ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది.

భారత జట్టు ప్రకటించే సమయంలో రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్.. దినేశ్ కార్తీక్‌లలో ఎవర్నో ఒకర్ని తీసుకోవాలని సెలక్టర్లు భావించారు. అనూహ్యంగా పంత్ ను తప్పించిన సెలక్షన్ కమిటీ అనుభవానికే పెద్దపీట వేసింది. పంత్ ను పక్కన పెట్టేసి.. ధోనీ తర్వాత దినేశ్ కార్తీక్‌కు రెండో వికెట్ కీపర్ గా జట్టులో అవకాశమిచ్చింది. భారత జట్టులో వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీకే సెలక్టర్లు తొలి అవకాశం కల్పించగా.. రెండో వికెట్ కీపర్ గా 33ఏళ్ల దినేశ్ కు ప్రాధాన్యం ఇచ్చారు. చాలామంది మాజీ క్రికెటర్లు 21ఏళ్ల పంత్ ను ఇండియా కోల్పోయినట్టేనని గట్టిగా నమ్ముతున్నారు. 
Also Read : ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ : హైదరాబాద్‌లో OnePlus ఎక్స్‌పీరియ‌న్స్‌ సెంటర్

ICC Cricket World Cup 2019
 Dinesh Karthik
rishabh pant
Virat Kohli
dhoni

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు