మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో దేవరకొండ స్థానం ఏంటి..?

Submitted on 14 March 2019
Vijay Devarakonda Topped List In Most Desirable Men

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల ఎంపికలోనే కాదు క్రేజ్‌ పరంగానూ విజయ్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రతో అదరగొట్టీన విజయ్ ఆ తర్వాత పెళ్లిచూపులు, అదే సంవత్సరం అర్జున్ రెడ్డి తో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపం తో బాక్స్ ఆఫీసులో రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమాలు విజయ్‌ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లాయి. విజయ్‌ తాజాగా 2018 హైదరాబాద్‌ మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.
Read Also : #RRR మూవీ : రిలీజ్ డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతో చెప్పేశారు

హైదరాబాద్‌ టైమ్స్ నిర్వహించిన సర్వేలో గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన విజయ్‌ దేవరకొండ, ఈ ఏడాది తొలి స్థానంలో నిలిచి సత్తా చాటాడు. టాలీవుడ్ టాప్‌ హీరోలు ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి విజయ్‌ మొదటి స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు.

Vijay Devarakonda
Most Desirable Men
Top List
2019

మరిన్ని వార్తలు