వీడియో : క్రౌన్ గెలిచింది.. ఫైర్ అంటుకుంది..! 

Submitted on 3 January 2019
Miss Africa’s hair, presentation ceremony, Miss Congo Dorcas Kasinde, Miss Africa 2018 pageant  
  • మిస్ ఆఫ్రికా విజేతకు చేదు అనుభవం.. 

  • వేదికపై జుత్తుకు అంటుకున్న మంటలు.. 

  • తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్        

మిస్ ఆఫ్రికా-2018 విజేతగా ఎంపికైన మిస్ కాంగో డోర్కాస్ క్యాసిండేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల ఆఫ్రికాలో అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతగా కాంగోను న్యాయనిర్ణేతలు ప్రకటించారు. అనంతరం ఆమెను వేదికపైకి ఆహ్వానించారు. క్రౌన్ గెల్చుకున్న సంతోషంలో వేదికపై అడుగుపెట్టింది. ఒకవైపు హర్షధ్వనాల, ఉత్సవాల మధ్య వేదికపై వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లింది. వచ్చే మార్గంలో టపాసుల వెలుగుల్లో మిస్-ఆఫ్రికా నవ్వులు చిందిస్తూ తెగ సంబరపడిపోయింది.

తోటి కంటెస్టంట్ ను హత్తుకొని ముచ్చటిస్తోంది. అంతలో ఆమె జుట్టుకు ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఏం జరిగిందో తేరుకునేలోపే ఆమె జట్టు సగానికిపైగా కాలిపోయింది. అది గమనించిన అక్కడి వ్యక్తి వెంటనే మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనతో షాకైన మిస్ కాంగో కాసేపటికి తేరుకొని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇదే ఆ వీడియో... 

Miss Africa’s hair
presentation ceremony
Miss Congo Dorcas Kasinde
Miss Africa 2018 pageant  

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు