వియత్నాం పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి

Submitted on 9 May 2019
Vice-President M Venkaiah Naidu embarks on a 4-day visit to Vietnam

నాలుగురోజుల వియత్నాం పర్యటనకు బయల్దేరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.వియత్నాంతో భారతదేశపు సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.వియత్నాం నాయకులతో వన్-ఆన్-వన్ చర్చల తర్వాత వియత్నాంలోని ఉత్తర హనమ్ ఫ్రావిన్స్ లోని టామ్ చుక్ పగోడా దగ్గర జరిగే 16వ యునైటెట్ నేషన్స్ డే ఆఫ్ విసాక్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య పాల్గొంటారు. వియత్నాం పర్యటనలో బుద్దిస్ట్ అప్రోచ్ టు గ్లోబల్ లీడర్ షిప్ అండ్ షేర్డ్ రెస్ఫాన్సిబులిటీస్ ఫర్ సస్టెయినబుల్ సొసైటీస్ ప్రారంభ కార్యక్రమంలో వెంకయ్య కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు.

వియత్నాం రాజధాని హనోయ్ చేరుకున్న వెంటనే భారతీయ అంబాసిడర్ ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి వెంకయ్య మాట్లాడతారు.వియత్నం ఉపాధ్యక్షుడితో కూడా వెంకయ్య సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.వియత్నాం నేషనల్ అసెంబ్లీ చైర్ పర్శన్  నుగుయన్ కిమ్ థి నగాన్ తో కూడా వెంకయ్య సమావేశమవనున్నారు.వ్యాపార,పెట్టుబడుల సంబంధాలపై ఉపరాష్ట్రపతి, వియత్నం నేతల మధ్య చర్యలు జరగనున్నట్లు తెలుస్తోంది. 

Venkaiah Naidu
Vietnam
OFFICIAL VISIT
Vice President
TRADE
INVESTMENT RELEATIONS
HIGH LEVEL TALKS
HANOI

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు