‘విరాట పర్వం’ లో విలక్షణ నటి

Submitted on 18 February 2020
Versatile Actress Nandita Das Joins the Sets of Virata parvam

దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’ (Revolution is an act of Love’). 1980-1990లో తెలంగాణా ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది.

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘మహానటి’ ఫేమ్ డానీ శాంచెజ్-లోపెజ్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘విరాటపర్వంలో’ అలనాటి తార టబు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసింది.

తాజాగా మరొక నటి కూడా ఈ  నటిస్తున్నారు. ఈ మూవీలో నటించాలని బహుభాషా, విలక్షణ నటి నందితాదాస్‌ను దర్శకుడు వేణు ఊడుగుల సంప్రదించారు. ఇందుకు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు తాజాగా  సెట్స్‌కు కూడా వెళ్లారు. అక్కడ సందడి చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దర్శకుడు వేణు ఊడుగులకు ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘ప్రస్తుతం ‘విరాట్ పర్వం’ సినిమా సెట్స్‌లో ఉన్నా. తెలుగులో మాట్లాడటం కంటే సెట్స్‌లో ఉండటం సంతోషంగా ఉంది.’’ అని నందితా పేర్కొన్నారు. నటి నందితా దాస్‌తో వర్క్ చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు వేణు ఊడుగుల కూడా సమాధానం ఇచ్చారు. హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Virata parvam

 Nandita Das Joins the Sets of Virata parvam

Nandita Das

Virata parvam
Rana Daggubati
Sai pallavi
Tabu
Nandita Das
Suresh Productions
SLV Cinemas
Venu Udugula

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు