షియోమీ సంచలనం : వెండింగ్ మిషన్లలో ‘స్మార్ట్ ఫోన్లు’ సేల్ 

Submitted on 14 May 2019
Vending Machines to sell Smartphones and Accessories in Xiaomi Mi Express Kiosks in India

ఇండియన్ మొబైల్ మార్కెట్లలో చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటికప్పుడూ అదిరిపోయే ఫీచర్లతో Xiaomi MI స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. షియోమీ విడుదల చేసిన ఎంఐ, రెడ్ మి నోట్ స్మార్ట్ ఫోన్లకు ఇండియాలో ఎంతో క్రేజ్ ఉంది. దేశంలో మొబైల్ మార్కెట్ ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోన్న షియోమీ నుంచి వెండింగ్ మిషన్లు వచ్చేశాయి. ఇకపై యూజర్లు.. స్మార్ట్ ఫోన్లు కొనాలంటే.. మొబైల్ స్టోర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్ లైన్ స్టోర్లలో కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం అంత కన్నా లేదు. 

స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయడం ఇకపై ఎంతో ఈజీ. స్మార్ట్ ఫోన్ల సేల్స్ కోసం Mi Express Kiosks లను షియోమీ ఇండియాలో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసేందుకు Xiaomi ప్లాన్ చేస్తోంది. ఈ వెండింగ్ మిషన్లలో నుంచి స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. యాక్ససిరీస్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఎంఐ ఎక్స్ ప్రెస్ కియాస్క్ దగ్గరే నేరుగా తమకు నచ్చిన స్మార్ట్ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. 

అన్ని రకాల పేమెంట్స్ : బెంగళూరులో ఫస్ట్ 
షియోమీ గ్లోబల్ విపి మను కుమార్ జైన్ బెంగళూరులోని మన్యతా టెక్ పార్క్ దగ్గర ఫస్ట్ Xiaomi Kiosk ను ఆవిష్కరించారు. చూడటానికి అచ్చం ATM మిషన్లలానే ఈ Vending Machines ఉంటాయి. ఈ కియాస్క్ లో అన్ని రకాల పేమెంట్స్ చేసుకునేలా డిజైన్ చేసినట్టు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్యాష్, యూపీఐ పేమెంట్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయొచ్చు. వెండింగ్ మిషన్లలో టచ్ స్ర్కీన్ ద్వారా నచ్చిన స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం.. పేమెంట్ చేయడం.. అంతే.. క్షణాల్లో మీకు నచ్చిన మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. 

భవిష్యత్తులో అన్ని మెట్రో నగరాల్లో :
ముందుగా.. ఈ స్మార్ట్ ఫోన్ వెండింగ్ మిషన్లను ఇండియాలోని మెట్రో సిటీల్లో ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఈ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. పబ్లిక్ ఏరియాల్లో.. ఎయిర్ పోర్టులు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, టెక్ పార్కులు దగ్గర ఎంఐ ఎక్స్ ప్రెస్ కియాస్క్ లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మెట్రో సిటీల్లో ఎక్కడ షియోమీ కియాస్క్ మిషన్లు ఉన్నాయో.. Mi.com వెబ్ సైట్ ద్వారా యూజర్లు చెక్ చేసుకోవచ్చు. 

Xiaomi Mi Express
Smartphones
Accessories
Xiaomi Mi
india
Metro Citites

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు