ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక పర్యావరణ జోన్ లు..ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్న ప్రభుత్వం

Submitted on 18 February 2020
Uttarakhand to bring out policy to promote Spiritual eco-zones

ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యావర జోన్ లను ప్రొత్సహించేందుకు ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. జోన్ ల ఏర్పాటుకు ఇప్పటికే లొకేషన్లను గుర్తించడం జరిగిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

'దేవ్‌భూమి' (దేవుని భూమి)గా కూడా పిలువబడే ఉత్తరాఖండ్ లో అనేక ఆధ్యాత్మిక పర్యావరణ జోన్లను అభివృద్ధి చేసే విధానంలో మేము కృషి చేస్తున్నాము. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక వైవిధ్యాలతో దీవించబడింది. ఈ సామర్థ్యాన్ని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం విస్తరించాలనుకుంటున్నామని ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ  ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో ఇటువంటి జోన్లను సృష్టించే ఆలోచనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమోట్ చేస్తున్నారని,ఎందుకంటే ఇది దాని సహజమైన బలాన్ని సమర్థవంతంగా నిర్మించగలదని, రాష్ట్రాన్ని గ్లోబల్ స్పిరిచ్యువల్ ఎకనామిక్ జోన్(ప్రపంచ ఆధ్యాత్మిక ఆర్థిక జోన్)గా ఆవిష్కరించగలదని ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు.

ఆధ్యాత్మిక పర్యావర జోన్లను సృష్టించడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే...యోగా, పంచకర్మ మరియు ఆయుర్వేద పద్ధతుల కోసం ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ(ఎకో సిస్టమ్)ను సృష్టించడం, గ్లోబల్ వెల్‌నెస్ ఎకానమీపై పెట్టుబడి పెట్టడం. 2017 లో గ్లోబల్ వెల్‌నెస్ ఎకానమీ 4.2 ట్రిలియన్ డాలర్ల విలువైనది. అంతేకాకుండా ప్రతి ఏటా 6.4 శాతం పెరుగుతోంది. ముందుగా రిషికేష్,అల్మోరా,తెహ్రి,గంగోత్రి,యమునోత్రి సహా మరికొన్ని ఏరియాలను ముఖ్యమైన లొకేషన్లుగా ముందుగా గుర్తించామని,అక్కడ ఇలాంటి జోన్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తాము అని ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు.

ఉత్తరాఖండ్ ను పర్యాటక ప్రదేశంగా మాత్రమే కాకుండా వెల్‌నెస్(మంచి ఆరోగ్యస్థితి ఉండటం) గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి, ఆ రాష్ట్రం ఏప్రిల్‌లో డెహ్రాడూన్‌లో రెండు రోజుల పాటు 'ఉత్తరాఖండ్ వెల్‌నెస్ సమ్మిట్ 2020' ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్-17,18న వెల్‌నెస్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని,రాష్ట్రాన్ని వెల్‌నెస్ గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి మరియు ఈ జోన్లలో పెట్టుబడులను ప్రోత్సహించే దిశలో ఇది ఒక అడుగు అని సింగ్ తెలిపారు. ఈ సమ్మిట్ లో పెట్టుబడిదారుల నుండి సలహాలు తీసుకుని తదనుగుణంగా పాలసీని చక్కగా తీర్చిదిద్దుతామని, ఈ లోపల రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సింగ్ తెలిపారు. 

అంతకుముందు ముంబై నుంచి పెట్టుబడుదారులను ఈ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా,రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ మంగళవారం(ఫిబ్రవరి-18,2020)ఆహ్వానించారు. 2018తో తాము "డెస్టినేషన్ ఉత్తరాఖండ్"అనే కార్యక్రమాన్ని నిర్వహించామని,దానికి అద్భుతమైన స్పందన వచ్చిందని,దాదాపు 1.25లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఎమ్ఓయూ(memoranda of understanding)లపై సంతకాలు జరిగాయని,ఇందులో దాదాపు 21వేల కోట్ల రూపాయల విలువైప పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయని,ఇదే స్పందనను ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగే సమ్మిట్ లో కూడా వస్తుందని భావిస్తున్నామని సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తెలిపారు. దాదాపు 200మంది పెట్టుబడిదారులు ఈ సమ్మిట్ కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Spiritual
ECO ZONES
uttarakhand
policy
Govt
trivendra singh rawat
PROMOTEWELLNESS
summit
INVESTMENTS

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు