కోట్లకొద్ది మాస్క్‌లను దొంగిలించి, హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ను పోగుచేసుకుని, ఈ సంక్షోభ సమయంలో అమెరికా ఏం చేయబోతోంది?  

Submitted on 8 April 2020
USA stealing of Crores of Masks and HCQ storing to overcome during Covid-19 crisis

మూడు కోట్ల hydroxychloroquine టాబ్లెట్లు ఉన్నాయని, ఇంకా ఇండియా నుంచి తీసుకొంటామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. ఈ మలేరియా మందుతో కరోనా ఎంతవరకు కట్టడి అవుతుందో తెలియదుకాని, ట్రంప్ మాత్రం వేలంవెర్రిగా, బెదిరించి, భయపెట్టి, లాలించి ఇతరదేశాల నుంచి గుట్టుగా మలేరియా మందును పోగేస్తున్నారు.   Director of the National Institute of Allergy and Infectious Diseasesను ఈ మలేరియా మందు గురించి ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించారు. అంటే, ఈ hydroxychloroquine లాభనష్టాల గురించి ఎవరూ మాట్లాడరు. ట్రంప్ గట్టిగా చెబుతున్నా, ఈ ట్యాబ్లెట్ల శక్తి గురించి చాలా సందేహాలున్నాయి. ఈ ముందును lupus చికిత్సకు వాడతారు. వాళ్లకివ్వాల్సిన మందులనూ ట్రంప్ లాక్కున్నారు.  అధ్యక్షుడు గొప్పగా చెబుతున్నారుకాని,  FDA ఇంతవరకు hydroxychloroquineను కరోనా చికిత్సగా పనికివస్తుందని సర్టిఫికెట్ ఇవ్వలేదు.

ఏప్రిల్ 2న, కోట్లకొద్ది మాస్క్‌లను కొనడానికి, అమెరికా భారీగా ఖర్చుచేసిందని రిపోర్ట్స్ వచ్చాయి. కరోనా దెబ్బకు అల్లల్లాడుతున్న ఫ్రాన్స్‌కు చైనా మాస్క్‌లను  పంపితే, మధ్యలో అమెరికా వాటిని దొంగిలించింది. ఏప్రిల్ 3న కూడా అలాంటి రిపోర్టే వచ్చింది.  జర్మనీ కోసం చైనా పంపిన రెండు లక్షల N95మాస్క్‌లను తమ దేశానికి మళ్లించింది. థాయిలాండ్‌లో జర్మనీ విమానంలో లోడ్ చేయాల్సిన మాస్క్‌లను తమ విమానంలో తరలించుకుంది. వీటిని బెర్లిన్ పోలీసులు ఆర్డర్ ఇచ్చారు. జర్మనీలో లక్షకు పైగా కరోనా కేసులున్నాయి. ఇటలీ, స్పెయిన్, అమెరికా తర్వాత ఎక్కువ కేసులున్న దేశం జర్మనీయే. అమెరికాకు ఇదేం పాడుబుద్ధి. తాము బాగుంటే చాలు, పక్కవాళ్లు ఏమైపోయినా పర్వాలేదా?

మలేరియా మందు ఎక్కడున్నా తమకే కావాలనుకొంటున్నారు డొలాన్డ్ ట్రంప్. ఇది తప్పుకదా! అన్ని దేశాలకూ అవసరం ఉందికదాని మీరు అడగొద్దు. ట్రంప్ బుద్ధే అంత. స్వార్ధం ఎక్కువ. మహమ్మారి సమయంలోనూ అమెరికా నేను బాగుంటే చాలు అన్న ధోరణిని ప్రదర్శిస్తోంది. అమెరికా రాష్ట్రాల మధ్య గొడవలు పెడుతున్నారు ట్రంప్. న్యూయార్క్‌కు వేలాది వెంటిలేటర్లు కావాలి. చైనా ఇప్పటికే వెయ్యి ventilatorsను దానం చేసింది. వాటిని అవసరమైన రాష్ట్రాలకు మాత్రం పంపించడంలేదు.

కరోనా నేర్పిన పాఠం ఒక్కటే. ఈ గ్లోబల్ ఎకానమిలో సరిహద్దులు, హద్ధులూ అన్నవాటికి విలువలేదు. కరోనా ఎక్కడికైనా వెళ్లగలదు. ఒక దేశం, లేదంటే ఇంకో రాష్ట్రం విఫలమైతే.... మనమూ అంతే. కెనడా, దక్షిణాఫ్రికాలకు వైద్య పరికరాలను సప్లయ్ చేయొద్దంటూ ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. అంతెందుకు సొంతదేశంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు చూస్తున్నారు. ఇది సరాసరి అమెరికా మీదనేకాదు, ప్రపంచం మీదనే ప్రభావం చూపిస్తుంది. పోనీ మలేరియా మందుతో అద్భుతం జరిగి అమెరికాలోని కరోనా బాధుతులందరికీ బాగైపోతుందనుకొందాం. అలాగని కరోనా ఆగదుకదా? మిగిలిన దేశాల నుంచి అలలు అలలుగా వచ్చిపడుతూనే ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి , బెర్లిన్ పోలీసుల నుంచి మాస్క్‌లను ఎత్తుకెళ్తే ఏంటి లాభం?

See Also | కరోనా పోరాటానికి ఎవరు ఎక్కువ విరాళమిచ్చారు? టాటానా? అంబానీనా? లేదంటే...అజీమ్ ప్రేమ్ జీనా?

usa
stealing Crores Masks
HCQ
Covid-19 crisis
donald trump
VENTILATORS
HYDROXYCHLOROQUINE

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు