తినేటప్పుడు స్మార్ట్ ఫోన్ ఇచ్చేయండి.. ఫ్రీ పిజ్జా తీసుకోండి

Submitted on 11 June 2019
US Restaurant Offers Free Pizzas to Those Who Surrender Their Smartphones While Eating

24 గంటలూ.. 365 రోజూలూ చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ లేకపోతే ఏదో వెలితి. ఫోన్ లేని జీవితాన్నే ఊహించుకోలేకపోతున్నారు నేటి జనం. ఉదయం నిద్ర లేవగానే గతంలో దేవుడి బొమ్మ చూసేవారు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తున్నారు.. ఎక్కడ పెట్టామా అని వెతుకుతున్నారు. అక్కడి నుంచి బాత్రూంకి వెళ్లినా.. టిఫిన్ తింటున్నా.. ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా.. డ్రైవింగ్ లో ఉన్నా.. పెళ్లయినా.. పేరంటమైనా.. చావు అయినా.. శుభకార్యం అయినా ఫోన్ లేనకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కు వచ్చేశారు జనం.

దీన్ని గమనించిన అమెరికాలోని ఓ రెస్టారెంట్ ఓ ఆఫర్ ఇచ్చింది. మా రెస్టారెంట్ కు రండి.. హ్యాపీగా తిని వెళ్లండి అంటూనే.. తినేటప్పుడు మీ స్మార్ట్ ఫోన్ మాకు ఇచ్చేయండి.. ఫోన్ చూడకుండా హ్యాపీగా ఫుడ్ ను ఎంజాయ్ చేస్తే పిజ్జా ఫ్రీ అని ప్రకటించింది. రెస్టారెంట్ లో ఫోన్ గోల లేకుండా.. రింగ్ సౌండ్స్ లేకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది.  

విడ్డూరంగా ఉన్నా నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనలను బాగా క్యాచ్ చేసింది ఆ రెస్టారెంట్ అంటున్నారు పబ్లిక్. తినే తిండిని కూడా సెల్ఫీలతో సహా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయందే.. ముక్క తుంచరు.. నోట్లో ముద్ద పెట్టుకోని రోజుల్లో ఇలాంటి ఆఫర్ వల్ల ఫ్యామిలీ మధ్య అనురాగం, ఆప్యాయతను మళ్లీ తీసుకొస్తున్నారని అందరూ ఆ రెస్టారెంట్ నే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

అదే.. యూఎస్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో కర్రీ పిజ్జా కంపెనీ రెస్టారెంట్. మీల్ చేసే సమయంలో ఎవరైతే స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటారో ఆ గ్రూపులో నలుగురికి 40 నుంచి 50 వరకు పిజ్జాలను ఫ్రీగా ఇచ్చేసింది. 

రెస్టారెంట్ లోకి ఎంటర్ కాగానే.. ముందుగా తమ స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని కండీషన్ పెట్టింది. కస్టమర్ల ఫోన్లను తీసుకెళ్లి లాకర్లలో పెట్టేస్తున్నారు. ఎవరైతే మీల్ పూర్తయ్యే వరకు లాకర్ల వైపు తిరిగి చూడటం, లేదా ఫోన్ కోసం వెతకకుండా ఉంటారో వారిలో నలుగురికి రెస్టారెంట్ యాజమాన్యం ఉచితంగా పిజ్జాలను ఆఫర్ చేస్తోంది.

ఇలా చేయడం వల్ల చాలామంది తినే సమయంలో ఫోన్లను వాడటం తగ్గించి ఎక్కువ సమయం తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారని రెస్టారెంట్ సహా యజమాని వీరేందర్ మాల్హి  చెప్పారు. 

US Restaurant
 Free Pizzas
Smartphones
Eating Meals
Restaurant Offer
pizzas to groups

మరిన్ని వార్తలు