U.S. plans massive coronavirus vaccine testing effort to meet year-end deadline

డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్.. లక్ష మంది వాలంటీర్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికాలో కరోనా వ్యాక్సిన్ తయారీ పరీక్షలు మంచి ఫలితాలు ఇస్లున్నాయి. ఈ క్రమంలోనే 2020 చివరి నాటికి డిసెంబర్ వరకు సురక్షితమైన మరియు సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ అందించే ప్రయత్నంలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. ఇందుకోసం మొత్తం లక్ష మంది వాలంటీర్లను రెడీ చేస్తున్నారు. ఈ వాలంటీర్లు యునైటెడ్ స్టేట్స్‌లోని అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్ అందిస్తారు. సైంటిస్టుల లెక్క ప్రకారం ఆరు కంటే ఎక్కువ కంపెనీలు డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ తయారు చేస్తాయి. 

వాస్తవానికి కరోనా లాంటి వైరస్‌కి వ్యాక్సిన్ తయారు చెయ్యాలంటే పదేళ్ల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు పది నెలల్లోనే యునైటెడ్ స్టేట్స్ సైంటిస్టులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ మూడు నెలలుగా అదే పనిలో ఉండగా.. డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ పూర్తి చెయ్యనున్నారు.

అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ 16 లక్షల మందికి పైగా వ్యాపించగా.. మరణాలు లక్షకు చేరువ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ల మందికి పైగా వైరస్ సోకగా, 3లక్షల 35వేల మందికి పైగా మరణించారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను కాపాడడానికి మహమ్మారిని ఆపడమే మార్గం. దీంతో వ్యాక్సిన్ తయారీపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. 

ఈ క్రమంలోనే ఇప్పటివరకూ అమెరికాలో ఒక ఫార్మా కంపెనీ చేసే వ్యాక్సిన్ ఫార్ములాలు ఇతర ఫార్మా కంపెనీలకు తెలియకుండా చేస్తుండగా.. ఆ రూల్ ఇప్పుడు పక్కన పెట్టారు. అన్ని కంపెనీలూ తమ తమ పరీక్షల వివరాల్ని పూర్తిగా పంచుకొని ముందుకు సాగబోతున్నాయి. ఈ క్రమంలోనే జులైలో 20 వేల నుంచి 30 వేల మందిపై వ్యాక్సిన్ల ప్రయోగాలు చెయ్యాలని అనుకుంటున్నారు. ఇందుకోసం లక్ష నుంచి లక్షా 50 వేల మంది పరీక్షల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఆపరేషన్ వార్ప్ స్పీడ్ (Operation Warp Speed) అనే పేరు కూడా పెట్టారు. 

ఎటువంటి ఇబ్బందులు లేకపోతే పరీక్షలు కొనసాగించవచ్చు అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కాలిన్స్ కూడా ఇంటర్నేషనల్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. మొదట్లో కొద్ది మందిపై చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవ్వడంతో… నెక్ట్స్ ఎక్కువ మందిపై ప్రయోగించేందుకు చాలా కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాల్లో వ్యాక్సిన్ మొదటి దశ సక్సెస్ అయి… రెండో దశకు చేరడంతో… ట్రంప్ ప్రభుత్వం 30 కోట్ల డోసుల ఉత్పత్తి కోసం 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని తెలిపింది.