శెభాష్ పోలీస్ : హాలీవుడ్ యాక్షన్ సీన్ తలపించిన రెస్క్యూ ఆపరేషన్

Submitted on 18 October 2019
us cops rescue the man from car at railway track before the train

తెల్లవారు ఝూమువేళ.. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోయింది. కారులో అపస్మారక స్ధితిలో డ్రైవర్.. కిలోమీటర్ దూరంలో వేగంగా వస్తున్న రైలు.. పోలీసు అధికారికి సమాచారం అందింది. ప్రాణాలకు తెగించి కారులోని డ్రైవర్ ను కాపాడాడు ఆ పోలీసు అధికారి. అమెరికాలోని ఊతా రాష్ట్రంలోని సెంటర్‌ విల్లే హైవే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

వివరాల్లోకి వెళితే అమెరికా రాష్ట్రం సెంటర్‌విల్లే హైవే ప్రాంతంలో రూబెన్ కారియా అనే పోలీసు అధికారి.. రాత్రి పూట డ్యూటీ చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఓ ఫోన్ వచ్చింది. రైల్వే ట్రాక్‌పై ఓ కారు ఉందని, అందులో ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి ఉన్నాడని ఎవరో ఫోన్ చేశారు. అప్రమత్తమైన రూబెన్.. వెంటనే కారు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. దూరం నుంచి రైలు వస్తుంది. కొద్ది నిమిషాల్లో రైలు కారును ఢీ కొట్టబోతున్నది. విషయం తెలిసి కూడా కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. 

కారులో ఉన్న వ్యక్తి అపస్మారక స్ధితిలో ఉండటంతో అతడిని వెంటనే బయటకు లాగారు. పోలీస్ ఆఫీసర్ రూబెన్ డ్రైవర్ ను బయటికి లాగిన కొద్ది సెకన్లలోనే.. రైలు కారును ఈడ్చుకుంటూ వెళ్లింది. తన జీవితంలో ఇలాంటి ఘటనను ఇంత దగ్గర నుంచి చూస్తానని కలలో కూడా అనుకోలేదని పోలీస్ రూబెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించానని చెప్పుకొచ్చారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రూబెన్ ధైర్యసాహసాలను చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ మరొక వ్యక్తి ప్రాణాలను కాపాడిని పోలీస్ అధికారికి శభాష్ అంటూ నెటిజన్లు రూబెన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కారులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చగా.. కొద్ది గంటల తర్వాత నిజం తెలుసుకున్నాడు. ప్రాణాలు కాపాడిన రూబెన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తాను కారుతో పాటు రైల్వే ట్రాక్‌పైకి ఎలా వెళ్లాడన్నది తెలియాల్సి ఉంది.

Washington
railway track
Car
Police
rescue

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు