ఔషధాల మెండు : ‘పండు’ దెబ్బకు యూనివర్శిటీ ఖాళీ 

Submitted on 15 May 2019
University of Canberra evacuated over smelly Durian fruit in australia

పండు..దెబ్బకు యూనివర్శిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. పండు అంటే ఏదో పూరీ జగన్నాథ్ సినిమాలో మహేశ్ బాబు కాదు. చెట్టుకుకాసిన పండేనండీ బాబూ..ఈ పండు ఓ పేద్ద యూనివర్శిటీపై కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు..యూనివర్శిటీ మొత్తం ఖాళీ చేయించేసింది ఈ పండు. పండు తినటానికే కాదు పరుగులు పెట్టించటానక్కూడా ఉపయోగపడుతుందనే విషయం మీకు తెలుసా? ఈ పండేంటి పరుగులు పెట్టించటమేంటీ అనుకుంటున్నారా? అసలా పండేంటి? దాని కథేంటీ? దాని పేరేంటి అనే డౌట్స్ వచ్చే ఉంటాయి కదూ. ఆ పరుగుల పండు పేరు డ్యూరియన్. 

ప్రపంచంలోనే అత్యంత దుర్వాసనను వెదజల్లే పండు డ్యూరియన్.  ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ కాన్బెర్రాలో స్టూడెంట్స్ ఈ పండును తెచ్చి చెత్తబుట్టలో పడేశారు.  దాని వాసన అదేనండి దుర్వాసన యునివర్శిటీ మొత్తం వ్యాపించింది. దీంతో వర్శిటీ కేవలం ఆరంటే ఆరే నిమిషాలలో మొత్తం 550 మంది విద్యార్థులను యూనివర్శిటీ నుంచి బయటకు పంపేశారు. ఈ విషయాన్ని వర్శిటీ అధికారులు తెలిపారు. విద్యార్ధులను పంపివేసిన అనంతరం చెత్తబుట్టను తొలగించామనీ యూనివర్శిటీకి చెందిన లైబ్రరీ ఫేస్‌బుక్ పేజీలో  తెలిపారు. 

డ్యూరియన్ పండు వింతలు..విశేషాలు  
డ్యూరియన్ పండు చూసేందుకు చిన్నసైజు పనసకాయలా ఉంటుంది. అంటే పండు పైన అంతా ముళ్లు ముళ్లుగా ఉంటుంది. కానీ దీని రుచి కూడా అద్భుతం ఉంటుందట. కానీ దాన్ని తినాలంటే దాని కంపు భరించాల్సిందేనట. థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్‌లో ఈ పండును పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో తీసుకెళ్లకూడదని నిషేదం విధించారు అంటే దీని దుర్వాసన ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

పండులో  కొలెస్ట్రాల్ శాతం అసలు ఉండదట. డ్యూరిన్  పండు తింటే  షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినొచ్చు. ఇన్సులిన్ స్థాయిని పునరుద్ధరించటమే కాక దాన్ని క్రమబద్దంగా పనిచేసేలా చేస్తుంది.మానవ శరీరంలోని హార్మోన్ల నియంత్రణకు దోహదం చేస్తూ సల్ఫర్ ని  కలిగి ఉంటుంది. ఈ పండులో ఉండే మెగ్నీషియం మరియు ఫోలిక్ యాసిడ్ రక్త నాళాల గోడలను బలోపేతం చేస్తాయి మరియు తక్కువ రక్తపోటుకు సహాయపడతాయి. మనిషికి ఇంతగా ఉపయోగపడే ఈ డ్యూరియన్ పండు మొత్తం యూనివర్శిటీనే ఖాళీ చేయించిందంటే చిత్రంగా ఉంది కదూ. 
ఒక్కోటి మినిమం 3 కేజీల బరువు ఉంటుంది. తొక్క తీసి లోపల ఉన్న పండు తింటారు. మార్కెట్‌లో బాగా పండిన పండు ధర అమెరికా డాలర్లలో 990 డాలర్లు. మన  ఇండియా కరెన్సీలో రూ.75 వేల వరకు పలుకుతుంది.
Also Read : కలుపు మందు కారణంగా క్యాన్సర్: కంపెనీకి రూ.14 వేల కోట్ల జరిమానా

Australia
University of Canberra
Students
Durian
Fruit

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు