లాక్‌డౌన్ పుణ్యమా అని పదేళ్ల తర్వాత శారీరకంగా కలుసుకున్న పాండా జోడీ

two-giant-pandas-are-finally-mating-after-10-years-when-world-locked-down

ప్రపంచమంతా ఇళ్లల్లోనే ఉండిపోతుంది. కరోనా ధాటికి అత్యవసరమైతే తప్ప రోడ్ల మీద మనుషులే కనిపించడం లేదు. ఇక సినిమా థియేటర్లు, పార్కులు అయితే చెప్పే పనేలేదు. రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా బహిరంగ ప్రదేశాల్లో, గుంపులుగా మనుషులు కనిపించడం లేదు. ఈ కీలక సమయం ఆ రెండు భారీ ఎలుగుబంట్లకు బాగా కలిసొచ్చింది. 

పది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కలవని ఆ జోడీ సహజంగానే కలిశాయి. హాంకాంగ్ లోని ఓషన్ పార్క్ యాజమాన్యం దీనిపట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. యింగ్ యింగ్, లీలీ అనే ఎలుగు బంట్లు చాలా కాలంగా ఇదే జూ లో ఉంటున్నాయి. అవి సహజంగా కలవాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం. కుదరలేదు. 

'మేటింగ్ ప్రోసెస్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయింది. ఇవాళ చాలా అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఇలా సహజంగా కలవడంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువని జూలాజికల్ ఆపరేషన్స్ అండ్ కన్సర్వేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైకేల్ బూస్ అంటున్నారు. పాండాలకు సాధారణంగానే కాస్త ప్రైవసీ కావాలి. 

కరోనా వైరస్ లాక్ డౌన్ వీటికి బాగా కలిసొచ్చింది. మార్చి నుంచి మే వరకూ వాటికి బ్రీడింగ్ సీజన్. అవి రెండూ మంచి ఆరోగ్యంగానే ఉన్నాయి. అవి కలవడంతో ప్రెగ్నెన్సీపై జూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండింటిలోనూ హార్మోన్ స్థాయిలు యాక్టివ్ గా ఉన్నాయి. హాంకాంగర్లు ఈ సంవత్సరం తీపి కబురు వింటారని జూ నిర్వహకులు అంటున్నారు. 

మరిన్ని తాజా వార్తలు