ప్రాణాలు తీసిన ర్యాష్ డ్రైవింగ్ : అల్వాల్‌లో యాక్సిడెంట్ ఇద్దరు మృతి 

Submitted on 20 September 2019
Two dead road Accident  in Alwal Hyderabad

డ్రైవింగ్ లో నిర్లక్ష్యం..అతి వేగం  నిండు ప్రాణాల్ని నిలువునా తీసేస్తున్నాయి. పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా..ఎన్ని ఫైన్లు వేస్తున్నా అతివేగంతోను..ర్యాష్ డ్రైవింగ్ లతో ను హడలెత్తిస్తు ప్రాణాల్ని బలిగొంటున్నారు. ఈ క్రమంలో అతివేగానికి మరో రెండు ప్రాణాలు బలైపోయాయి. 


ఆల్వాల్ సమీపంలోని సుచిత్ర రోడ్డులో  జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అల్వాల్ లోని భేల్ ఎన్ క్లేవ్ కు చెందిన ప్రియదర్శినతో పాటు ఆమె మేనల్లుడు అయాన్ ఈ ఘటనలో మృతి చెందారు. హాస్పిటల్ కు వెళ్లి తిరిగి బైక్ పై  వస్తున్న వీరిని వెనకనుంచి వచ్చిన ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా ప్రియదర్శిని సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. 

బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఇద్దరు యువకులు కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ..హాస్పిటల్ నుంచి వస్తున్న ప్రియదర్శినీ..ఆయాన్ లను ఢీకొన్నారు. దీంతో వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గాయపడిన ప్రియదర్శిన అన్నను హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతి చెందిన ప్రియదర్శిని, అయాన్ మృతదేహాలను గాంధీ హాస్పిటల్ కు పోస్ట మార్టం నిమిత్తం తరలించారు.ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్రమాదంపై సిఐ యాదగిరి మాట్లాడుతూ.. జామ్ లో కారు రెంట్ కు తీసుకుని బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుని  వస్తున్నవారు బైక్ ను ఢీకొన్నారని తెలిపారు. వారిద్దరు మద్యం సేవించి ఉన్నారా లేదా అనే విషయంపై విచారిస్తున్నామని తెలిపారు. 

Two dead
road accident
Alwal
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు