Twitterati trend '#PoojaMustApologizeSamantha' after Pooja Hegde's post on Samantha Akkineni; what's the truth?

PoojaMustApologizeSamantha సమంత అస్సలేం బాగుండదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గురువారం ఉదయం టాలీవుడ్ అభిమానులు పూజా హెగ్దే ఇన్‌స్టాగ్రామ్ చూసి షాక్ అయ్యారు. ఆ పోస్టులో సమంత అందంగా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదని ఉంది. ఇది చూసి స్క్రీన్ షాట్లతో #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్‌గా మారింది. ఇలా కాసేపు గడిచిన తర్వాత పూజా హెగ్దే తన ఇన్‌స్టాగ్రామ్ పేజి ఎవరో హ్యాక్ చేశారని చెప్పింది. 

‘హాయ్, నా టీంకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పాను. నా డిజిటల్ దీని నుంచి బయటపడటానికి సాయం చేస్తుంది. నా అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్లు, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఏదైనా బయటికొస్తే దానిని ఇతరులతో పంచుకోవద్దు. థ్యాంక్యూ’ అని పోస్టు చేసింది. 

ఆ తర్వాత మరో పోస్టులో ఓ గంట క్రితం నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గురించి భయం వేసింది. నా టెక్నికల్ టీంకు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లే సాయం చేశారు. మళ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను వాడుతున్నా. ఈ గంట క్రితం నా పేజిలో చేసిన పోస్టులు, అనుసరించిన వాళ్లు మొత్తం పోతాయి. అని పోస్టు చేసింది. 

అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజి నుంచే పోస్టు రావడంతో సమంత అభిమానులు క్షమాపణ అడుగుతున్నారు. పూజా కచ్చితంగా సమంతాకు క్షమాపణ చెప్పాల్సిందే. సమంత ఓ మంచి టాలెంటెడ్ నటి. దక్షిణాధితో పాటు ఉత్తరాధిలోనూ ఆమె ఫ్యామస్. ఆమెకు ఎటువంటి ఇంట్రడక్షన్ అవసర్లేదు’ అని ట్వీట్ చేశాడు. 

 

మరో యూజర్ ఆ గంటలో జరిగిన విషయాల గురించి చెప్పాడు. 
1. సమంత సినిమా గురించి. 
2. సమంతపై అసూయతో అవమానించిన పూజా హెగ్దే.
3. తర్వాత అకౌంట్ హ్యాక్ అయినట్లు నటించిన పూజా.
4. చివర్లో మళ్లీ అకౌంట్ దక్కించుకున్నానని చెప్పడం. అని పేర్కొన్నాడు. 

Related Posts