ట్విట్టర్‌లో కొత్త ఫీచర్ : ఎలక్షన్ ట్వీట్లపై కంప్లయింట్ చేయొచ్చు

Submitted on 24 April 2019
Twitter adds feature for users to report content that misleads voters

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వేగంగా వ్యాపిస్తోంది. ఎన్నికల వేళ.. ఓటర్లను తప్పుదోవ పట్టించేలా మిస్ లీడింగ్ కంటెంట్ ఎక్కువగా స్ర్పెడ్ అవుతోంది. ఏది నిజమో? ఏది ఫేక్ కంటెంటో తెలియని పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ ఫాంలు వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు.. ఫేక్ న్యూస్ భరతం పట్టేందుకు చర్యలు చేపట్టాయి. ఇప్పడు.. ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ కూడా ఫేక్ కంటెంట్ పై కన్నెర్ర చేసింది. ఎన్నికలు, ఓటింగ్ కంటెంట్ వైరల్ చేసేవారిపై ఓ కన్నేసి ఉంచుతోంది. ఓటర్లను తప్పుదోవ పట్టించే కంటెంట్ పై ట్విట్టర్ యూజర్లు కంప్లయింట్ చేసేందుకు ఓ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది.

అదే.. ‘రిపోర్ట్ ట్వీట్’. ఈ ఫీచర్ ఆధారంగా యూజర్లు.. మిస్ లీడింగ్ కంటెంట్ పై ఫిర్యాదు చేయొచ్చు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేక్ న్యూస్ కంటెంట్ స్ర్పెడ్ కావడంపై ఆయా కంపెనీలను ప్రభుత్వం హెచ్చరించింది. తమ ప్లాట్ ఫాంపై ఎలాంటి అభ్యంతరకరమైన కంటెంట్ వైరల్ అయితే సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం.. గత 30 రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫాంలపై ఫేక్ న్యూస్ స్ర్పెడ్ అయినట్టు ఒకరిద్దరూ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ట్విట్టర్ బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఫేక్ న్యూస్ కట్టడిపై రిపోర్టింగ్ కొత్త ఫీచర్ ను తమ ప్లాట్ ఫాంలో యాడ్ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 
Also Read : ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్

‘ట్విట్టర్ ప్లాట్ ఫాంపై.. ఏప్రిల్ 25న ఇండియాలో 2019 లోక్ సభ ఎన్నికలతో ఈ ఫీచర్ స్టార్ట్ కానుంది. ఏప్రిల్ 29న యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలతో రిపోర్ట్ ట్వీట్ ఫీచర్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగబోయే అన్ని ఎన్నికల సమయంలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది’ అని సంస్థ పేర్కొంది. హౌ టూ ఓటు లేదా ఓటు నమోదు ట్వీట్లు కూడా ఓటర్లను తప్పుదోవ పట్టించడం కిందకు వస్తుందని, ట్విట్టర్ రూల్స్ ఉల్లంఘించినట్టే అవుతుందని తెలిపింది. దీనికి సంబంధించి ట్విట్టర్ ఉదాహరణగా.. ఓటు ట్వీట్, టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్, ఫోన్ కాల్ .. కంప్లయింట్ చేయొచ్చునని పేర్కొంది. ఓటింగ్ ఆవశ్యకత, ఐడెంటీఫికేషన్ రిక్వైర్ మెంట్స్ లేదా తప్పుడు సమాచారం, సమయం, తేదీ, ఎన్నికల సమయం వంటి విషయాలతో యూజర్లు రిపోర్ట్ చేయొచ్చు. 

ఇందుకు ట్విట్టర్ యూజర్లు చేయాల్సిందిల్లా..  ట్విట్టర్ యాప్ ద్వారా..  లాగిన్ అయి.. డ్రాప్ డౌన్ మెనూలో ‘రిపోర్ట్ ట్వీట్’ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మిస్ లీడింగ్ అబౌట్ ఓటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఈ ట్వీట్ ఓటింగ్ విషయంలో ఎలా తప్పుదోవా పట్టిస్తుందో తెలుసుకోనే అవకాశం ఉంది. ఇక్కడ రిపోర్ట్ పై సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ రిపోర్టింగ్ ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. 

గత కొన్నివారాలుగా సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ ఎన్నికల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. పొలిటికల్ యాడ్స్ లో పాదర్శకత పాటించాయి. ఫ్యాక్ట్ చెకర్లు, కమిషనింగ్ టూల్స్ ద్వారా ఎప్పటికప్పుడూ ఫేక్ కంటెంట్ ను గుర్తించి నిర్మూలించాయి.  
Also Read : మళ్లీ మొదలెట్టండీ : టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేత

Twitter
New feature
report content
misleads voters

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు