చర్చలు జరిగేనా : ఆర్టీసీ సమ్మె 19వ రోజు..విలీనంపై వెనక్కి తగ్గుతారా

Submitted on 23 October 2019
TSRTC Strike Whether the negotiations will take place

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ స్టడీ చేస్తోంది. రెండు రోజుల అనంతరం నివేదికను సర్కార్‌కు సమర్పించనుంది. 21 డిమాండ్ల పరిష్కారంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆర్టీసీ జేఏసీ నేతలు సునిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే..ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై జేఏసీ నేతలు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారం జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. 

ప్రభుత్వ విలీనంతో పాటు ఇతర డిమాండ్లపై పట్టుబట్టాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. చర్చలకు ఎవరిని పంపాలనే దానిపై మంతనాలు జరుపుతున్నారు. ఆర్థిక సమస్యలు లేని డిమాండ్లు కూడా ఉన్నాయని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని నేతలు సూచిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ తమను పిలవలేదని, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చిస్తే..సమస్యలు పరిష్కారమౌతాయని అన్నారు. చర్చిస్తామని తమకు ఎలాంటి సమాచారం లేదని బీఎస్ రావు ఆర్టీసీ జేఏసీ నేత 10tvకి వెల్లడించారు. ఆర్టీసీ విలీన విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, 26 డిమాండ్లపై చర్చ జరగాల్సిందేనని, చర్చలు ప్రారంభిస్తే..డిమాండ్లు పరిష్కారమయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విలీన విషయంలో కార్మికులు వెనక్కి తగ్గుతారా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాసేపట్లో తెలియనుంది. 
Read More : 

TSRTC
l Strike
negotiations
take place

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు