ఆర్టీసీ బస్సు బోల్తా.. 30మందికి గాయాలు

Submitted on 21 October 2019
ts rtc bus accident

యాదాద్రి జిల్లా భువనగిరి చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కారును ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరకాల డిపో బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతోంది. 
 
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సు అతి వేగంగా నడుపుతున్నాడని.. ఎదురుగా వస్తున్న కారును డ్రైవర్ గమనించలేని దీంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. 

అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. వారితో ఆర్టీసీ బస్సులు నడిపిస్తోంది. అయితే తాత్కాలిక డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. హైదరాబాద్ లోనూ తాత్కాలిక డ్రైవర్ల కారణంగా పలు ప్రమాదాలు జరిగాయి.

TSRTC
Bus Accident
Yadadri

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు