సమాధానం చెప్పలేక...ఢిల్లీలో రిపోర్టర్ పై ట్రంప్ ఎదురుదాడి

Submitted on 26 February 2020
Trump scolds CNN’s Jim Acosta in India: ‘You ought to be ashamed of yourself’

రెండు రోజులు భారలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు తన పర్యటన చివరి రోజు(ఫిబ్రవరి-25,2020)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే ఈ సమయంలో ఓ వారాసంస్థ ప్రతినిధిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. భారతీయ మీడియా ట్రంప్ ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలను అడగకుండా విదేశాంగశాఖ చాలా జాగ్రత్తపడినట్లుంది. దీంతో భారతీయ మీడియా ప్రతినిధులు ట్రంప్ కు ఇబ్బంది కలిగించే ఎలాంటి ప్రశ్నలను అడుగలేదు.

అయితే ఓ అంతర్జాతీయ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు మాత్రం ఎక్కడో కాలింది. దీంతో వెంటనే పొరుగుదేశంలో ఉన్నానని కూడా మర్చిపోయిన ట్రంప్...తనలో దాగి ఉన్న మరో ట్రంప్ ను బయటకు తీశారు. ఆ రిపోర్టర్ ప్రశ్నకు జవాబివ్వకుండా ఎదురుదాడికి దిగారు. అయితే ఆ రిపోర్టర్ కు ట్రంప్ కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సీఎన్ఎన్ రిపోర్టర్ అకోస్టా ట్రంప్ ను ప్రశ్నించారు.

రిపోర్టర్

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిరాకరిస్తూ మీరు అమెరికా ప్రజల ముందు ప్రతిజ్ఞ చేస్తారా?, ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారు? 

ట్రంప్ :

అన్నింటికన్నా మొదటిది... నాకు ఏ దేశం నుండి సహాయం వద్దు. ఎన్నికల్లో సాయం చేయాలని ఏ దేశాన్ని కోరలేదు. ఏ దేశం నుంచి నాకు సాయం అందలేదు. సీఎన్ఎన్ ఓ అద్భుతమైన నెట్ వర్క్. సీఎన్ఎన్ ఒక విధంగా క్షమాపణలు చెప్పారని నేను  ఊహిస్తున్నాను. నిజం కాని కొన్ని విషయాలు ప్రసారం చేసినందుకు  వారు క్షమాపణ చెప్పలేదా? చెప్పు, నిన్న వారి క్షమాపణ ఏమిటి? వారు ఏమి చెప్పారు? 

రిపోర్టర్ :

మిస్టర్ ప్రెసిడెంట్, .నిజాన్ని వెల్లడించడంలో మీతో పోలిస్తే మాకు మంచి రికార్డే ఉందని నేను భావిస్తున్నాను.

ట్రంప్ :  

మీ రికార్డ్ చూసి మీరే సిగ్గుపడాలి. మీ రికార్డ్ చాలా ఘోరంగా ఉంది. ప్రసార చరిత్రలో మీకు చెత్త రికార్డు ఉండవచ్చు.

ఇలా వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2018లో మీడియా సమావేశంలో ట్రంప్‌తో వాదులాటకు దిగిన అకోస్టా మీడియా పాస్‌ను అధ్యక్ష భవనం రద్దు చేసింది. ఆ తర్వాత కోర్టు జోక్యంతో దానిని పునరుద్ధరించారు. 

trump
cnn
reporter
jim acosta
scolds
india
ASHAMED
brodacasting
record
SORRY
Truth

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు