Trump says U.S. to withdraw from World Health Organization and announces new broadsides against Beijing

ట్రంప్ సంచలన నిర్ణయం: ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా గుడ్‌బై

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అమెరికా చట్టం ప్రకారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో ఉన్న సంబంధాన్ని పూర్తిగా ముగించుకుంటున్నట్లు ప్రకటించారు. అర్ధరాత్రి వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు బీజింగ్ నియంత్రణలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయంటూ ఆరోపించిన ట్రంప్.. వాటి నిర్లక్ష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వైరస్ విషయంలో కీలక అంశాలు దాచిపెట్టిందని ఆరోపిస్తూ చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.

అమెరికా చట్టాలను గౌరవించకుండా అమెరికా గడ్డపై ఉన్న చైనా కంపెనీలపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. WHOకు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన నిధులను ప్రపంచంలోని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఏడాదికి 400 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సహకారం అమెరికా చేస్తుండగా.. ఇతర ఆరోగ్య సమూహాలకు వాటిని మళ్లించనున్నట్లు ప్రకటించారు. 

Read: చైనా సరిహద్దు వివాదం : Modi కలత చెందారు – Trump