టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Submitted on 9 July 2019
TRT Counseling Schedule Release

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కౌన్సెలింగ్ షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. టీఆర్టీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు జులై 13, 14 వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎస్టీజీ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే ఉన్న కారణంగా ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాషా పండితుల పోస్టింగ్ ప్రక్రియను జులై 10 నుంచి 20వరకు చేపట్టనున్నారు. 

ఎంపికైన అభ్యర్థులు, ఖాళీల వివరాలు సహా కౌన్సెలింగ్ జరిగే ప్రాంతాన్ని డీఈవోలు జులై 10 వ తేదీ ప్రకటించనున్నారు. జులై 11న జిల్లా స్థాయి కమిటీలు సమావేశమై ఖాళీలను ఖరారు చేసి నోటీసు బోర్డులో పెట్టనున్నారు. అదేరోజు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 13, 14 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత నియామక ఉత్తర్వులు, పోస్టింగ్ ఇవ్వనున్నారు. పోస్టింగ్ ఆర్డర్ అందుకున్న అభ్యర్థులు జులై 15 న పాఠశాలలో చేరాల్సివుంటుంది. 

శాశ్వత ఉపాధ్యాయుడు లేని పాఠశాలల్లో కనీసం ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడిని కేటాయించాలని జిల్లా కమిటీకి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 8 వేల 792 ఉపాధ్యాయ ఖాళీలకు టీఆర్టీటీ నిర్వహించగా కోర్టు వివాదాలు లేని 2 వేల 656 ఉద్యోగాలకే కౌన్సెలింగ్ నిర్వహించనునున్నారు. స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీ పోస్టులను మాత్రం పూర్తిగా భర్తీ చేయనున్నారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో కొంతవరకు సబ్జెక్టు నిపుణుల కొరత తీరనుంది. 

1,941 స్కూల్ అసిస్టెంట్లు, 46 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. భాషా పండితుల పోస్టులు మొత్తం 1,011 ఉండగా వీటిలో తెలుగు, ఉర్దూ, మరాఠీ ఖాళీలు 669 మాత్రమే భర్తీ చేయనున్నారు. 


 

TRT
Counseling
schedule
release
Telangana
Hyderabad


మరిన్ని వార్తలు