థియేటర్ ఓనర్ అయిన త్రివిక్రమ్

Submitted on 12 June 2019
Trivikram Is A Theater Owner Now

స్టార్ రైటర్, స్టార్ డైరెక్టర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాడని తెలుస్తుంది. త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో చేసే ఒక్కో సినిమాకు ప్రాఫిట్స్, షేర్ కలిపి రూ.15 కోట్ల వరకు అందుకుంటాడట.. సంవత్సరానికి ఓ సినిమా తీసే త్రివిక్రమ్ తన సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తాడట..

ఇప్పటికే హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు, వైజాగ్, విజయవాడలోనూ ఆయనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు థియేటర్ రంగంలోకి అడుగు పెట్టాడు.. త్రివిక్రమ్ రీసెంట్‌గా ఈస్ట్ గోదావరిలోని రాజానగరంలో రాయుడు అనే థియేటర్ కొనుగోలు చేసాడని, ఇందుకుగానూ దాని పునరుద్ధరణ ఖర్చులతో కలిపి రూ.5 కోట్లు వెచ్చించారని తెలుస్తుంది.

ఇప్పటికే వి.వి.వినాయక్, తేజ వంటి దర్శకులు ఈ థియేటర్ బిజినెస్‌లో ఉన్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు. 

Trivikram
Trivikram Bought A Theater

మరిన్ని వార్తలు