మే 31 వరకు పలు రైళ్లు రద్దు 

Submitted on 16 May 2019
Trains canceled between May 16 and May 31

పలు రైళ్లను రద్దు చేస్తు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్‌, భద్రత నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను మే 16 నుంచి  31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారి సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

కాజీపేట్‌-అజ్ని ప్యాసింజర్‌ (నెంబర్‌ 57136) మే  16 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. 
అజ్ని-కాజీపేట్‌ ప్యాసింజర్‌ (నెంబర్‌ 57135) ఈ నెల 16 నుంచి జూన్‌ 1 వరకు 
మణుగూరు-కాజీపేట్‌ ప్యాసింజర్‌ (నెంబర్‌ 57657) ఈ నెల 16నుంచి 31వ తేదీ వరకు రద్దు
కాజీపేట్‌-మణుగూరు ప్యాసింజర్‌ (నెంబర్‌ 57658) ఈ నెల 16నుంచి 31వ తేదీ వరకు రద్దు
బొల్లారం-హైదరాబాద్‌ ప్యాసింజర్‌ (నెంబర్‌ 57131) ఈ నెల 16నుంచి 31వ తేదీ వరకు రద్దు
ఫలక్‌నుమా-భువనగిరి మెము ప్యాసింజర్‌ (నెంబర్‌67275) ఈనెల 16నుంచి 31వరకు రద్దు
భువనగిరి-ఫలక్‌నుమా మెము ప్యాసింజర్‌ (నెంబర్‌ 67276) ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు రద్దు 
మధ్యాహ్నం 1.45 గంటలకు బయల్దేరే భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)-విజయవాడ (67246) వెళ్లే రైలు రద్దు 
ఉదయం 8 గంటలకు విజయవాడ (67245) నుంచి బయలుదేరి భద్రాచలం రోడ్ 12.45 గంటలకు చేరుకునే ప్యాసింజర్ డోర్నకల్ వరకే నడుస్తుందని తెలిపారు. 

AP
Telangana
Trains
Canceled
May 16
May 31
South Central Railway

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు